»   » యూఎస్ఏలో ప్లాప్ సినిమాల కలెక్షన్స్.... బ్రూస్ లీ టాప్ (లిస్టు)

యూఎస్ఏలో ప్లాప్ సినిమాల కలెక్షన్స్.... బ్రూస్ లీ టాప్ (లిస్టు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు వసూళ్ల పరంగా యూఎస్ఏ బాక్సాఫీసు ఎంతో కీలకమైనది. కొన్ని సినిమాల విషయంలో అయితే యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద వసూళ్ల ఆధారంగానే సినిమా హిట్టా? ఫట్టా? అనే విషయాలే తేల్చడంతో పాటు లాభ నష్టాలను బేరీజు వేస్తున్నారు.

2015లో తెలుగు పరిశ్రమ నుండి చాలా హిట్ సినిమాలు వచ్చాయి. బాహుబలి లాంటి భారీ హిట్ తో పాటు, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్, టెంపర్, గోపాల గెపాల, సన్నాఫ్ సత్యమూర్తి, కుమారి 21ఎప్, బలే భలేమగాడివోయ్ లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏలో కూడా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.


అయితే రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమాతో పాటు అఖిల్ తొలి మూవీ ‘అఖిల్', పలు చిత్రాలు అక్కడ భారీగా నష్టాలు మిగిల్చాయి. బ్రూస్ లీ మూవీ యూఎస్ఏలో రూ. 4.25 కోట్లు వసూలు చేసింది. అయితే భారీ ధరకు కొనుగోలు చేయడంతో పాటు ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయడంతో ఖర్చు తడిసి మోపెడయింది. దీంతో యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ కు నష్టాలు తప్పలేదు. అదే విధంగా అఖిల్ సినిమా హైప్ చూసి భారీ ధరకు కొన్న డిస్ట్రిబ్యూటర్ కూడా భారీగానే నష్టపోయాడు.


స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు..


బ్రూస్ లీ
  

బ్రూస్ లీ

రామ్ చరణ్ బ్రూస్ లీ 250 స్క్రీన్లలో విడుదలై రూ. 4.25 కోట్లు వసూలు చేసింది.


అఖిల్
  

అఖిల్

వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ నటించిన తొలి చిత్రం 150 స్క్రీన్లలో విడుదలై రూ. 1.11 కోట్లు వసూలు చేసింది.


షేర్
  

షేర్

కళ్యాణ్ రామ్ షేర్ 60 స్క్రీన్లలో విడుదలై రూ. 7.70 లక్షలు వసూలు చేసింది.


కేరింత
  

కేరింత

కేరింత చిత్రం 100 స్క్రీన్లలో విడుదలై రూ. 8.87 లక్షలు వసూలు చేసింది.


శివమ్
  

శివమ్

రామ్ నటించిన శివం చిత్రం 85 స్క్రీన్లలో విడుదలై రూ. 23.43 లక్షలు వసూలు చేసింది.


శంకరాభరణం
  

శంకరాభరణం

నిఖిల్ నటించిన శంకరాభరణం 82 స్క్రీన్లలో విడుదలై రూ. 36.33 లక్షలు వసూలు చేసింది.


కొరియర్ బాయ్ కళ్యాణ్
  

కొరియర్ బాయ్ కళ్యాణ్

నితిన్ నటించిన కొరియర్ బాయ్ కళ్యాన్ 63 స్క్రీన్లలో విడుదలై 20.69 లక్షలు వసూలు చేసింది.


చీకటి రాజ్యం
  

చీకటి రాజ్యం

కమల్ హాసన్ చీకటి రాజ్యం తెలుగు వెర్షన్ 40 స్క్రీన్లలో విడుదలై రూ. 19.27 లక్షలు వసూలు చేసింది.


బందిపోటు
  

బందిపోటు

అల్లరి నరేష్ బంది పోటు మూవీ 28 స్క్రీన్లలో విడుదలై రూ. 4.58 లక్షలు వసూలు చేసింది.


బీరువా
  

బీరువా

సందీప్ కిషన్ బీరువా మూవీ 35 స్క్రీన్లలో విడుదలై రూ. 2.69 లక్షలు వసూలు చేసింది.


Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu