»   »  ఏం కష్టపడుతున్నార్రా బాబూ...మన స్టార్ హీరోల పాట్లు (ఫొటో ఫీచర్)

ఏం కష్టపడుతున్నార్రా బాబూ...మన స్టార్ హీరోల పాట్లు (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : భగభగ మండే భానుడితో పోటీపడుతూ స్టార్‌ హీరోలంతా పనిలో నిమగ్నమయ్యారు. రెగ్యులర్ గా వేసవిలో షూటింగ్ చేయాల్సి ఉంటుందనుకొన్నప్పుడు... మన హీరోలు, దర్శకనిర్మాతలు కొన్నిసార్లు ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొంటుంటారు. ముందు టాకీ సన్నివేశాలన్నింటినీ తీసేసి పాటల్ని మాత్రం వేసవిలో తీసేలా ప్లాన్‌ చేస్తారు.

మన స్టార్ల సినిమాల్లోని పాటలు ఎలాగో విదేశాల్లోనే సాగుతాయి కాబట్టి... అక్కడికి వెళ్లి వేసవి తాపం నుంచి విముక్తి పొందుతూ పనిలో పనిగా పాటలు పూర్తి చేసుకుని రావొచ్చన్నమాట. పనికి పని, విహారానికి విహారం. కుటుంబాన్ని కూడా అక్కడికి తీసుకెళుతుంటారు. అన్నీ కుదిరినప్పుడు, స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేసినప్పుడు ఇలాంటి ప్రణాళికలు ఫలిస్తుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా జరగడం లేదు.

వెంకటేష్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌, రవితేజ, నాగచైతన్య... తదితర హీరోలంతా స్థానికంగానే చిత్రీకరణలతో గడుపుతున్నారు. ఈసారి మన అగ్ర హీరోల్లో చాలామందికి వేసవి సెలవుల యోగం ఉన్నట్టు కనిపించడం లేదు. చేతినిండా సినిమాలతో ఎవరికి వాళ్లు బిజీగా గడుపుతున్నారు.

ఎవరు..ఏ సినిమాతో బిజీ...స్లైడ్ షో లో

'ఆగడు'

'ఆగడు'

మహేష్‌బాబు 'ఆగడు' సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఎండల్ని లెక్కచేయకుండా మహేష్‌ ఏకధాటిగా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మార్చిలో బళ్లారి గనుల్లో చిత్రీకరణ జరిపారు. ఆయన '1' (నేనొక్కడినే) పూర్తయ్యాక కొన్నాళ్లు సెలవులు తీసుకొన్నారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లొచ్చారు. అందుకే ఇప్పుడు విరామం లేకుండా కష్టపడుతున్నారు.

'రభస'

'రభస'

ఎన్టీఆర్‌ 'రభస' క్త్లెమాక్స్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మండుటెండలో పోరాట సన్నివేశాల్లో నటిస్తున్నారు. 'రభస' ఇప్పటికే ఆలస్యమైందని ఎన్టీఆర్‌ భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టాలనుకొంటున్నారు.

'గోవిందుడు అందరివాడేలే'

'గోవిందుడు అందరివాడేలే'

రామ్‌చరణ్‌ 'తుఫాన్‌' చిత్రీకరణ తర్వాత నాలుగైదు నెలలు విరామం తీసుకొన్నారు. ఆ సమయాన్నంతా కుటుంబానికే కేటాయించారు. ఆ తర్వాతే 'గోవిందుడు అందరివాడేలే' మొదలుపెట్టారు. ఆ సినిమా చిత్రీకరణ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. కుటుంబ నేపథ్యంలో సాగే ఆ సన్నివేశాల్లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌ కథానాయికగా నటిస్తోంది.

 గోపాల గోపాల

గోపాల గోపాల

మొన్నటిదాకా వెంకటేష్‌ 'దృశ్యం'పై దృష్టిపెట్టారు. ఇప్పుడు గోపాలా గోపాలా చేస్తున్నారు. అర్జంటుగా ఆయనకి ఓ హిట్టు కావాలి. అందుకే ఎండల్ని లెక్కచేయకుండా ఏకధాటిగా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోంది.

'బాహుబలి'

'బాహుబలి'

ప్రభాస్‌ 'బాహుబలి' కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. ఇన్నాళ్లు సినిమా కోసం యుద్ధం చేసిన ఆయన ప్రస్తుతం కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. రామోజీఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. మధ్యలో వారం, రెండు వారాలు మినహా ఎక్కువగా విరామం ఇవ్వలేదు దర్శకుడు రాజమౌళి. ఆ సమయంలో కూడా ప్రభాస్‌ వ్యాయామాలు చేస్తూ ఎక్కువ సమయం జిమ్‌లోనే గడిపారు. వచ్చే యేడాదిలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి కాబట్టి... మరింత వేగంగా చిత్రీకరణ జరిపే అవకాశాలున్నాయి. వేసవి వచ్చిందంటే సమ్మర్‌ కటింగ్‌తో సిద్ధమైపోయే ప్రభాస్‌ ఈసారి మాత్రం ఒత్త్తెన జుత్తు, గెడ్డంతో ఎండలో పోరాటం చేస్తున్నారు.

'పవర్‌'

'పవర్‌'

రవితేజ ప్రస్తుతం 'పవర్‌' చిత్రీకరణలో గడుపుతున్నారు. త్వరలో బ్యాంకాక్‌లోతెరకెక్కించనున్న పోరాట సన్నివేశాల్లో పాల్గొనబోతున్నారు.

'ఒక లైలా కోసం'

'ఒక లైలా కోసం'

నాగచైతన్య 'ఒక లైలా కోసం' చిత్రం ప్యాచ్ వర్క్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే కొత్తగా కమిటైన చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.

 బాలకృష్ణ

బాలకృష్ణ

ప్రస్తుతం బాలకృష్ణ కొత్త చిత్రం షూటింగ్ కు సిద్దమవుతున్నారు. గాడ్సే టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. 'కొందరు కొడితే ఎక్స్‌రేలో కనిపిస్తుంది. కొందరు కొడితే స్కానింగ్‌లో కనిపిస్తుంది. నేను కొడితే హిస్టరీలో వినిపిస్తుంది...'. - కొత్త సినిమా కోసం బాలకృష్ణ పలికిన సంభాషణ ఇది. బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది సంభాషణలే. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట తూటాలా దూసుకుపోతుంది. తాజాగా మరోసారి అలాంటి పదునైన సంభాషణ పలికారాయన. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్‌.ఎల్‌.వి. సినిమా పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష హీరోయిన్. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఎన్నికలు పూర్తికాగానే పవన్‌కల్యాణ్ కూడా సెట్‌లోకి అడుగుపెట్టడానికి రంగం సిద్దం చేసుకున్నారు. అతి త్వరలో ఆయన గోపాల గోపాలా చిత్రం షూటింగ్ కి హాజరు కానున్నారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్‌ కొత్త సినిమాకి కూడా కొబ్బరికాయ కొట్టేశారు. రేపోమాపో ఆయన కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ లోగా ఆయన గుణ శేఖర్ దర్శకత్వంలో రెడీ అవుతున్న రుద్రమదేవి చిత్రం కోసం గోన గన్నారెడ్డిగా అవతారమెత్తుతున్నాడు.

English summary
As the weather gets scorching in the days to come, the box office barometer too is set to get blistering. This summer, the Telugu cinema screens are going to come alive with a variety of films, and movie aficionados can brace themselves for full-on entertainment, Tollywood ishtyle!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu