Dilraju: ఆ రెండు వెబ్ సైట్ల తాట తీస్తా.. మీడియాపై దిల్ రాజు ఫైర్
ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మీడియాపై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. తన గురించి తప్పుడు వార్తలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. అలాగే కావాలని సృష్టించి తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తే తాటా తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఎందుకు ఫైర్ అయ్యాడు, ఎవరిపై ఫైర్ అయ్యాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
"ప్రతీ సంక్రాంతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్ట్ గనో, ఇండైరెక్ట్ గానో.. నేను కష్టపడి ఈరోజు ఇండస్ట్రీలో ఈ పొజీషన్ లో ఉన్నందుకు.. ప్రతీ సంక్రాంతి ఏదో రకంగా కాంట్రవర్శీ చేస్తూ నాపైన కామెంట్లు చేస్తూనే ఉంటారు. మీకు తెలియంది కాదు.. ఆల్ మోస్ట్ 7, 8 ఇయర్స్ నుంచి ఇది నడుస్తూనే ఉంది. సో దీని గురించి చిరంజీవి మాట్లాడుతూ... చాలా బాగా చెప్పాడు. దిల్ రాజుకు తెలుసు. దీనికి ఎలా, ఏం చేయాలి అనేది, బాగా ఎక్స్ పీరియన్స్డ్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చారు.
Recommended Video


కానీ ఈరోజు కొన్ని వెబ్ సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకోలాగా టర్న్ చేసి ఓ రెండు ప్రముఖ వెబ్ సైట్లు వార్తలు రాశాయి. అంటే మీరు నాపై ఏదో రాసి మీ వెబ్ సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్లను వాడుకుంటున్నారు. మీకు ఇది అవసరమా.. అంటే దిల్ రాజ్ ఏం అనడు. చాలా సాఫ్ట్ గా ఉంటడు అనుకుంటున్నారా.. తాట తీస్తా.. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను.. ఎందుకు, ఎందుకు, ఎందుకు అనుకుంటూ సాఫ్ట్ గా వెళ్తున్న. ఆ ప్రొడ్యూసర్ నా గురించి ఏమైనా మాట్లాడితే ఇక్కడకు తీసుకొచ్చి నాతో మాట్లాడించండి.
ఎందుకు ప్రతీ సంక్రాంతికి నన్నే టార్గెట్ చేస్తున్నరు. ఇంత మంది నన్ను ఇష్టపడుతున్నారు. 95 పర్సంట్ నన్ను ఇష్టపడేవాళ్లు. మిగతా 5 పర్సంట్ వాళ్ల ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ ఫై చేయలేను. సాటిస్ ఫై చేస్తున్న కాబట్టే నాకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. మీ అందరికీ తెలుసు దిల్ రాజు అంటే. వ్యాపార పరంగా వచ్చే కాంట్రవర్శియల్స్ ను మీరు అడ్వాంటేజీగా తీసుకుని ప్రతీ సంక్రాంతికి మీ వెబ్ సైట్లు, మీ యూట్యూబ్ ల కోసం వాడుకుంటున్నరు. అది 100 పర్సంట్ తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ ల గురించి ఛాంబర్ లో ఓ మీటింగ్ పెట్టి, ఛాంబర్ ద్వారానే డీల్ చేసి రవితేజ గారిని కన్వీన్స్ చేసి ఒక సినిమాను సంక్రాంతి నుంచి తప్పించిన. అదెంత కష్టం అనేది మాకు తెలుసు.

మొన్నెవడో రాశాడు.. దిల్ రాజు గారు తమిళ సినిమాను రిలీజ్ చేస్తున్నానని.. ఎవడు చెప్పాడురా మీకు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా.. ఆ సినిమాను కూడా ఆపింది నేను. మీకు తెలియని న్యూస్ లు రాస్తూ ఎందుకు వాడుకుంటున్నరు నన్ను. ఇందాక చెప్పాను కదా తాటా తీస్తానని.. ఈజీగా తీసుకోవద్దు. నాపైన ఏదైనా రాస్తే తప్పుడు రాతలు రాస్తే మీకు తెలియకుండా కాంట్రవర్సీ చేస్తే ఈరోజు నుంచి నేను ఊరుకోను. ఇన్ని రోజులు నడిచిపోయింది. ఇది గుర్తు పెట్టుకోండి. నాలుగు సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఆయనతో పాటు హనుమాన్.
హనుమాన్ సినిమా రిలీజ్ ను నేను ఆపాలని చెప్పినట్లు రాసారు. హీరోను, డైరెక్టర్ ను, ప్రొడ్యూసర్ ను పిలిచి.. నేను సినిమా ఆపాలని అడిగానా.. సినిమాను 14వ తేదీన రిలీజ్ చేయమని అన్నాను. 12నాడు మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14 నాడు రిలీజ్ చేస్తే మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతయ్.. కానీ దాన్ని ఇంకో విధంగా మార్చి రాశారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకోలాగా కన్ క్లూడ్ చేసి రాస్తున్నారు. మీకు కావాల్సిన దాన్ని రీరైట్ చేయకండి. నెగిటివ్ వైబ్స్ ఉండకుండా రాస్తే బాగుంటది. అందరం పని వాళ్లమే. మీ ఛానెల్స్, వెబ్ సైట్ల కోసం నెగిటివ్ గా రాస్తారా.. అవసరమా..
ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాదు. ఎక్కడ థియేటర్లు లేవా దొరకట్లేదా.. నైజంలో ఏడెనిమిది థియేటర్లలో మహేష్ బాబుతో పాటు హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది. వెంకటేష్ సినిమాకు, నాగార్జున సినిమాకు దొరకట్లేదు. మీకు తెలుసా అది. వెంకటేష్, నాగార్జున చిన్న హీరోలు కాదు. స్టార్ హీరోలుగా ఇమేజ్ ఉన్న వాళ్లకు కూడా థియేటర్లు దొరకట్లేదు. ఇవి మీకు కనిపించవు. హనుమాన్ సినిమా సూపర్ హిట్టు కావాలని కోరుకుంటున్న వాళ్లలో నేనూ ఒకడిని. మళ్లీ మళ్లీ మళ్లీ చెబుతున్నా.. నా గురించి ఎవడన్నా తప్పుగా రాస్తే ఊరుకోను. డైరెక్ట్ గా వచ్చి మాట్లాడండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీతో కూర్చుని మాట్లాడతాను." అంటూ దిల్ రాజ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











