టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఆవిడ మృతి!
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో వరుసగా పెను విషాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని సినీ రంగాల్లో చాలా మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం సినీ నటులే కాకుండా.. సీరియల్స్ నటులు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. ఈ ఘటనలతో సినీ రంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుతోంది.
ఇటీవలే తెలుగు బుల్లితెర నటులు పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా, నటుడు చంద్రకాంత్ ఆమె మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తాజాగా తెలుగు సినీ రంగానికి చెందిన ఓ టాప్ ప్రొడ్యూసర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న సూర్యదేవర రాధాకృష్ణ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈయన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృ మూర్తి.. నాగేంద్రమ్మ ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. హృదయ సంబంధ సమస్యలతో బాధ పడుతున్న నాగేంద్రమ్మ.. ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 90 ఏళ్ల వయసు కల్గిన ఈమెకు.. మొత్తం నలుగురు సంతానం.
ఇద్దరు కొడుకు, ఇద్దరు కూతుళ్లు కాగా.. సూర్యదేవర రాధాకృష్ణ రెండో కుమారుడు. అలాగే యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న సూర్యదేవర నాగవంశీకి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. ఈమె మృతితో సూర్యదేవర కుటుంబంతో పాటు సినీ రంగంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. సినీ ప్రముఖులు అంతా రాధాకృష్ణకు ధైర్యం చెబుతూ.. నాగేంద్రమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రేపు ఉదయం 10 గంటలకు నాగేంద్రమ్మ అంత్యక్రియలు జరగబోతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో ఈమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. అయితే సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈ శుక్రవారమే విడుదల కాబోతుండగా.. అంతలోనే నాగేంద్రమ్మ మృతి చెందడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











