సీఎం జగన్‌తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల భేటీ.. అసలు కారణం ఇదే.. మాటిచ్చిన ముఖ్యమంత్రి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో టాలీవుడ్ చిత్రసీమలోని అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వెళ్లి అక్కడ ఆయన్ను కలిసి కాసేపు ముచ్చటించారు. దీంతో ఈ అంశం వార్తల్లో ప్రధాన శీర్షికల్లో ఒకటిగా నిలిచింది. ఇంతకీ జగన్‌తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల భేటీ ఎందుకు జరిగింది? జగన్‌ని కలిసిన ఆ నిర్మాతలెవరు? వివరాల్లోకి పోతే..

Recommended Video

Tollywood Producres Meeting With AP CM YS Jagan Mohan Reddy | Filmibeat Telugu
 జగన్‌తో భేటీ అయిన నిర్మాతలు

జగన్‌తో భేటీ అయిన నిర్మాతలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, శ్యాం ప్రసాద్‌ రెడ్డిలతో పాటు జెమిని కిరణ్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీ కూడా పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఈ భేటీ జరిగింది.

సీఎంకి ఆహ్వానం.. అసలు కారణమిదే

సీఎంకి ఆహ్వానం.. అసలు కారణమిదే

జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మాతలు.. సమావేశ వివరాలు తెలిపారు. తాము సీఎం జగన్‌ని కలవడానికి ప్రత్యేకమైన కారణం ఉందని, అందుకే ఆయనతో భేటీ అయి కాసేపు మాట్లాడామని తెలిపారు. ఈ మేరకు విశాఖలో జరకాబోయే ఇళ్ల‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని సీఎంకి ఆహ్వానం పలికినట్లు చెప్పారు.

తుఫాన్ దెబ్బకు భారీ నష్టం.. బాధితులకు అండగా టాలీవుడ్

తుఫాన్ దెబ్బకు భారీ నష్టం.. బాధితులకు అండగా టాలీవుడ్

2014 సంవత్సరం విశాఖలో సంభవించిన హుద్ హుద్ తుఫాన్ దెబ్బకు భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. తుఫాన్ కారణంగా ఎందరో పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు టాలీవుడ్ ఇండస్ట్రీ అండగా నిలిచింది. వాళ్లకు తిరిగి ఆశ్రయం కల్పించాలనే దృఢ సంకల్పంతో 15 కోట్ల రూపాయల విరాళాల‌ను సేక‌రించి కొత్త ఇల్లు నిర్మించింది.

మాటిచ్చిన జగన్..

మాటిచ్చిన జగన్..

కాగా ఈ సమావేశంలో తుఫాన్ బాధితుల కోసం తెలుగు సినీపరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఆ ఇళ్ల‌ను ప్రారంభించడానికి రావాలని జ‌గ‌న్‌ను ఆహ్వానించినట్లు చెప్పారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, ఈ మంచి పనిలో తాను భాగమై పూర్తయిన ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తానని మతిచ్చారని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X