టాలీవుడ్ 2017 రిపోర్ట్: కలెక్షన్ల పరంగా టాప్ 10 సినిమా ఇవే...

By Bojja Kumar

Recommended Video

టాలీవుడ్ బెస్ట్ అఫ్ 2017

2017 సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు విజయాల పరంగా కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా మార్కెట్ కూడా ఈ ఏడాది బాగా విస్తరించింది. ఈ ఏడాది విడుదలైన బాహుబలి 2 సినిమా దేశ వ్యాప్తంగా సృష్టించిన కలెక్షన్ల ప్రభంజనం అంతా ఇంతా కాదు. మరి ఈ ఏడాది ఎన్నో వందల సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. అందులో కలెక్షన్ల పరంగా టాప్ 10లో స్థానం దక్కించుకున్న సినిమాలేమిటో ఓ లుక్కేద్దాం.

 మొదటి స్థానంలో బాహుబలి 2

మొదటి స్థానంలో బాహుబలి 2

2017లో కలెక్షన్ల పరంగా టాప్ మూవీ ఏది అంటే..... ప్రతి ఒక్కరూ చెప్పేమాట ‘బాహుబలి -ది కంక్లూజన్'. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించిన చిత్రం ఇది. ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 1706.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

 2వ స్థానంలో స్పైడర్

2వ స్థానంలో స్పైడర్

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వం రూపొందిన ‘స్పైడర్' మూవీ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చినప్పటికీ.... గ్రాస్ కలెక్షన్ పరంగా చూస్తే తమిళం, తెలుగులో కలిసి రూ. 150 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మూడో స్థానంలో ఖైదీ నెం. 150

మూడో స్థానంలో ఖైదీ నెం. 150

దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం 150'. చిరంజీవి కెరీర్లోనే భారీ విజయం అందుకున్న ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం గ్రాస్ కలెక్షన్ రూ. 150 కోట్లకు చేరువైంది.

 నాలుగవ స్థానంలో జై లవ కుశ

నాలుగవ స్థానంలో జై లవ కుశ

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో జూ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ మూవీ భారీ సక్సస్ సాధించింది. ఈ సినిమా లో ఎన్టీఆర్ కి జోడిగా నివేత థామస్ , రాశికన్నా నటించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 130.90 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

5వ స్థానంలో దువ్వాడ జగన్నాధం

5వ స్థానంలో దువ్వాడ జగన్నాధం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన దువ్వాడ జగన్నాధం ఈ ఏడాది గ్రాస్ కలెక్షన్ పరంగా ఐదవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 98.1 కోట్లు వసులు చేసింది.

 6వ స్థానంలో కాటమరాయుడు

6వ స్థానంలో కాటమరాయుడు

నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బేనర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘కాటమరాయుడు'. ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేక పోయినప్పటికీ పవర్ స్టార్‌కు ఉన్న క్రేజ్ కారణంగా రూ. 97.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

 7వ స్థానంలో ఫిదా

7వ స్థానంలో ఫిదా

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా చిత్రం టైటిల్‌కి తగ్గట్టే ప్రేక్షకులను ‘ఫిదా' చేసింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

 8వ స్థానంలో గౌతమీ పుత్ర శాతకర్ణి

8వ స్థానంలో గౌతమీ పుత్ర శాతకర్ణి

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బేనర్లో నందమూరి బాలకృష్ణ చేసిన ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 78.6 వసులు చేసింది. తెలుగు సినిమా చరిత్రలో ఇదో గొప్ప మూవీగా నిలిచిపోయింది.

 9వ స్థానంలో నేను లోకల్

9వ స్థానంలో నేను లోకల్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘నేను లోకల్'. చిన్న చిత్రంగా రిలీజ్ అయినా.... టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 58 కోట్ల గ్రాస్ వసులు చేసి 9వ స్థానంలో నిలిచింది.

 10వ స్థానంలో అర్జున్ రెడ్డి

10వ స్థానంలో అర్జున్ రెడ్డి

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం‌లో విజయ్ దేవరకొండ, శాలిని పాండే నటించిన అర్జున్ రెడ్డి మూవీ ఈ ఏడాది వచ్చిన సంచలన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X