twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ విషాదాలు 2011

    By Bojja Kumar
    |

    తెలుగు చిత్రం సీమలో గతంలో ఎన్నడూ లేనన్ని విషాదాలు ఈ ఒక్క 2011 సంవత్సరంలోనే చోటు చేసుకున్నాయి. జనవరి 21న దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మరణంతో ఈ ఏడాది తొలి విషాదాన్ని చవిచూసింది. యాభై ఆరు ఏళ్ల వయసులోనే ఈవీవీ సత్యనారాయణ గుండెపోటుతో మరణించడం అందరినీ కలిచి వేసింది. ఆ తరువాత నెలకో విషాదం టాలీవుడ్‌ను వెంటాడిందనే చెప్పాలి. ఆ తరువాత సుమారు నెలరోజులకు ముళ్లపూడి వెంకటరమణ ఈ లోకానికి దూరమయ్యాడు.

    నూటొక్క జిల్లాల అందగాడుగా పాపులర్ అయిన నూతన్ ప్రసాద్ కూడా ఈ సంవత్సరం మార్చి 2న మరణించాడు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపవూతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. విలక్షణ నటి సుజాత కన్నుమూసింది కూడా ఇదే ఏడాది. కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించిందామె. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాక తెలుగు స్టార్ హీరోల్లో చాలామందికి తల్లిపావూతల్లో ఇమిడి 'అమ్మ'గా ఎక్కువ ఆదరణ పొందింది. 'నిన్ను చూడాలని' చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్‌ను సోలో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు విఆర్ ప్రతాప్. ల్యూకేమియాతో బాధపడుతున్న ఆయన స్వగ్రామమైన తెనాలిలో తుదిశ్వాస విడిచాడు.

    విలనిజానికి మారుపేరుగా నిలిచిన ప్రముఖ నటుడు రామిడ్డి కూడా ఇదే ఏడాది చనిపోయాడు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్ద సినిమాల్లో అవకాశాలు లేక చిన్న చిత్రాల్లోనే నటిస్తూ వచ్చాడు. తెలుగు సినిమారంగాన్ని దుఃఖంలో ముంచిన మరో విషాదం దాసరి పద్మ మరణం. అరవై ఐదేళ్ల పద్మ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ అక్టోబర్ 28న మరణించారు. సీనియర్ నటుడు మిక్కిలినేని, సీనియర్ గేయ రచయిత జాలాది, వర్ధమాన మాటల రచయిత గంధం నాగరాజు, సంగీత దర్శకుడు తుమ్మ అనిల్ రెడ్డి ఇదే ఏడాది తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

    డిసెంబర్ నెల టాలీవుడ్‌కు కలిసిరాలేదు. ఈ నెలలో ముగ్గురు ప్రముఖులు చనిపోయారు. డిసెంబర్ 11న దివంగతుడైన ఎం.ఎస్.డ్డి మరణవార్తను సినీ ప్రముఖులు, పెద్దలూ తట్టుకోలేకపోయారు. ఎం.ఎస్.డ్డి తరువాత మాటల మాంత్రికుడు త్రిపురనేని మహారథి చనిపోయాడు. మొన్న అక్కినేని అన్నపూర్ణ మరణించింది.

    English summary
    Telugu film industry has lost several big names in the year 2011. EVV Satyanarayana, actresses Sujata, Nutan Prasad, etc., demises have turned out to be unbearable losses to the Tollywood. Here, we are bringing you some of the deaths that left the industry mourning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X