శ్రీదేవి, సమంత, కాజల్, తమన్నా సందడి (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సినిమా ప్రపంచంలోని విషయాలతో ప్రేక్షకులకు వినోదం పంచడానికి ప్రారంభమైన టీవీ ఛానల్ 'టాలీవుడ్'. ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మితో పాటు, రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు.

సినిమా ఛానల్ ప్రారంభోత్సవం కావడంతో టాలీవుడ్ సెల్రబిటీలు హాజరై సందడి చేసారు. సీనియర్ హీరోయిన్ శ్రీదేవితో పాటు సమంత, కాజల్, తమన్నా, శ్రీయ, శాన్వి, మధుశాలిని, మధురిమ, శ్రీకాంత్, మంచు మనోజ్, అలీ, అల్లరి నరేశ్, తరుణ్, నవదీప్, నిఖిల్, ముఖేశ్ రుషి, రేష్మా హాజరయ్యారు.

తమ చానల్ సినిమా వాళ్లకు గొంతుకలా ఉంటుందని అగ్రి గోల్డ్ గ్రూప్ చైర్మన్ వి.ఆర్. రావు అవ్వాస్ చెప్పారు. అందమైన తెర మీద రూపాల్నే కాకుండా తెర వెనుక గాథల్నీ, సినిమాకి సంబంధించిన అనేక ఇతర అంశాల్నీ 'టాలీవుడ్' స్పృశిస్తుందనీ పేర్కొన్నారు. ప్రభుత్వానికీ, చిత్ర పరిశ్రమకూ మధ్య వారధిగా చానల్ పని చేస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీతారామ్ అవ్వాస్ తెలిపారు.

టాలీవుడ్

టాలీవుడ్


టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, సినీ ప్రముఖులు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు, సినీ ప్రముఖులుకృష్ణంరాజు, సమంత, మనోజ్ తదితరులు ఈ దృశ్యంలో ఉన్నారు.

సమంత

సమంత

టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రముఖ నటి సమంత. పక్కన ప్రముఖ నటుడు కృష్ణం రాజు కూడా ఉన్నారు.

కృష్ణం రాజు

కృష్ణం రాజు


ప్రముఖ నటుడు కృష్ణంరాజు టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని జ్యోతి వెలిగించారు.

శ్రీదేవి, తమన్నా

శ్రీదేవి, తమన్నా

టాలీవుడ్ ఛానల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూడా హాజరయ్యారు. శ్రీదేవి అభిమాని అయిన తమన్నా....ఆమె పక్కనే కూర్చొని కబుర్లాడారు.

మనోజ్

మనోజ్


టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటుడు మంచు మనోజ్ కూడా జ్యోతి ప్రజ్వలన చేసారు. పక్కనే ప్రముఖ నటుడు కృష్ణ రాజు ఉన్నారు. ఆదృశ్యాన్ని ఈ ఫోటోలో చూడొచ్చు.

తమన్నా, శ్రీయ, కాజల్

తమన్నా, శ్రీయ, కాజల్

టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టాప్ హీరోయిన్లయి తమన్నా, శ్రీయ, కాజల్ ఇలా ఒకే చోట కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు.

సమంత

సమంత

టాలీవుడ్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తన స్టైలిస్ట్ కోన నీరజతో కలిసి వస్తున్న సమంత. కార్యక్రమంలో సమంత సాంప్రదాయ చీరకట్టు అందరినీ ఆకట్టుకుంది.

కృష్ణం రాజు

కృష్ణం రాజు

నటుడు కృష్ణం రాజు టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తన భార్యతో కలిసి హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

టాలీవుడ్ స్టార్స్

టాలీవుడ్ స్టార్స్

టాలీవుడ్ స్టార్స్ అయిన హీరో నిఖిల్, మనోజ్, అలీ, శ్రీకాంత్ లు టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఒకే చోట ఇలా సందడిగా గడిపారు. అందరూ కూర్చోవడానికి స్థలం లేక పోయినా...ఇలా సర్దుకుని కూర్చున్నారు.

శ్రీదేవి, బోనీకపూర్

శ్రీదేవి, బోనీకపూర్

టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ ఫోటోలో చూడొచ్చు.

బిగోపాల్, ముఖేష్ రిషి

బిగోపాల్, ముఖేష్ రిషి

ప్రముఖ దర్శకుడు బి గోపాల్, నటుడు ముఖేస్ రిషి టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇద్దరు ఒకే చోట కూర్చోవడంతో బిగోపాల్ రాబోయే సినిమాలో ముఖేష్ రిషి నటించే అవకాశం ఉందని అంటున్నారు.

టాలీవుడ్ హీరోస్

టాలీవుడ్ హీరోస్

తెలుగు సినిమా హీరోలైన తనీష్, మంచు మనోజ్, కమెడీయన్ అలీ, హీరో శ్రీకాంత్, నవదీప్ తదితరులను ఇక్కడ దృశ్యంలో చూడొచ్చు. అందరూ ఒకే చోట చేరి సందడి చేసారు.

శ్రీదేవితో కాజల్

శ్రీదేవితో కాజల్

ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి కనిపించడంతో హీరోయిన్ కాజల్ ఇలా ఆమె వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఒకప్పుడు శ్రీదేవిని సినిమాల్లో చూసి హీరోయిన్ కావాలని కలలుకన్న వారిలో కాజల్ కూడా ఒకరు.

కుర్ర హీరోయిన్లు

కుర్ర హీరోయిన్లు

ఇప్పుడిప్పుడే హీరోయిన్లుగా ఎదుగుతున్న కుర్ర హీరోయిన్లంతా ఇలా ఒకే వద్ద చేరారు. వీరంతా ఒకే చోట కూర్చోవడంతో గ్లామర్ అంతా ఒకే చోట పోగైనట్లు ఉందని చూసిన వారు అంటున్నారు.

వేదికపై శ్రీకాంత్, నరేష్

వేదికపై శ్రీకాంత్, నరేష్

టాలీవుడ్ హీరోలైన శ్రీకాంత్, అల్లరి నరేష్ స్టేజిపై సందడి చేసారు. వారి పక్కనే రాష్ట్ర మంత్రి దుద్దుళ్లి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

శ్రీదేవితో శివారెడ్డి

శ్రీదేవితో శివారెడ్డి

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి శ్రీదేవి-బోనీ కపూర్‌తో కలిసి ఇలా ఫోటో దిగారు. శ్రీదేవి లాంటి హీరోయిన్ అంటే అభిమానం ఉండని వారు ఎవరుంటారు?

కృష్ణం రాజు, నిఖిల్, తరుణ్

కృష్ణం రాజు, నిఖిల్, తరుణ్

టాలీవుడ్ ప్రముఖ నటుడు కృష్ణం రాజు, యువ నటులు నిఖిల్, తరుణ్ ఇలా వేదికపై సందడి చేసారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

శ్రీయ, శివారెడ్డి

శ్రీయ, శివారెడ్డి

నటుడు, మిమిక్రి ఆర్టిస్టు శివారెడ్డి హీరోయిన్ శ్రీయతో కలిసి ఇలా ఫోటో దిగారు. ఈ చిత్రంలో ఉన్న చిన్నారి బహుషా శివారెడ్డి సంతాన అయి ఉండొచ్చు. శ్రీయ సాంప్రదాయ చీరకట్టుతో ఆకట్టుకుంది.

తమన్నా

తమన్నా

హీరోయిన్ తమన్నా ఈ కార్యక్రమంలో ఎంతో అందంగా, గ్లామరస్‌గా కనిపించింది. ముఖ్యంగా ఆమె డ్రెస్ చాలా బాగుందని అంతా అంటున్నారు. ఆమె గ్లార్‌కు ఈ డ్రెస్ మరింత వన్నె తెచ్చిందని అంటున్నారు.

తమన్నా, కాజల్

తమన్నా, కాజల్

సినిమాల పరంగా వీరి మధ్య పోటాపోటీ వాతావరణం నడుస్తున్నప్పటికీ....ఇక్కడ మాత్రం చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు తమన్నా, కాజల్. నిజంగా వీరి మధ్య అంత మంచి స్నేహం ఉందా..?

అర్చన

అర్చన

టాలీవుడ్ టీవీ చానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు తారలు ఆడి పాడారు. నటి అర్చన స్టేజి పెర్ఫార్మెన్స్ ఇక్కడ దృశ్యాంలో చూడొచ్చు. ఆమె డాన్స్ షో ఆకట్టుకుంది.

మధుశాలిని

మధుశాలిని

నటి మధుశాలిని టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆమె చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉందని అంటున్నారంతా...

పూనమ్ కౌర్

పూనమ్ కౌర్

ఆ మధ్య రెండు మూడు సినిమాల్లో మెరిసిన పూనమ్ కౌర్‌కు ఈ మధ్య అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు ఆమె కొన్ని చిన్న సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇలా దర్శనం ఇచ్చారు.

రీచా పనయ్

రీచా పనయ్

నటి రీచా పనయ్ టాలీవుడ్ టీవీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇలా దర్శనం ఇచ్చారు. అందుకు సంబంధించని దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X