Nandamuri Balakrishna: బాలకృష్ణ కోసం లైన్‌లో ఇద్దరు బడా నిర్మాతలు.. ఛాన్స్ ఎవరికో మరి!
నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వింటే చాలు ఆయన అభిమానులు అంతా చొక్కాలు చించుకుంటారు. అణువణువునా అభిమానాన్ని నింపుకొని ఆయన కోసం ఏమైనా చేసేస్తుంటారు. 62 ఏళ్ల వయసులోనూ ఆయన అనేక చిత్రాల్లో నటిస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇంత ఏజ్ వచ్చినా ఏమాత్రం ఖాళీగా కూర్చోకుండా.. అద్భుతమైన డ్యాన్స్, అంతకు మించిన యాక్టింగ్ తో ఇరగ దీస్తున్నారు. ముఖ్యంగా మాస్ గా కనిపిస్తూ.. మస్తు మస్తు స్టెప్పులు వేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
తాజగా భగవంత్ కేసరి చిత్రంతో మన ముందుకు వచ్చిన బాలయ్య బాబు.. అద్భుతమైన టాక్ తో దూసుకెళ్తున్నారు. భగవంత్ కేసరి చిత్రం ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టుగా దూసుకెళ్తోంది. ఈ ఊపులోనే నందమూరి బాలకృష్ణ వరుసగా పలు చిత్రాలను లైన్ లో పెట్టుకుంటున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రొడ్యూసర్లతో పాటు డైరెక్టర్లు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ బాబీతో కలిసి బాలయ్య బాబు NBK 109 చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథ, నటీనటులు ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం.

అలాగే ముఖ్యంగా NBK 110, NBK 111 సినిమాలను కూడా బాలయ్య బాబు లైన్ లో పెట్టారని, ముఖ్యంగా 110వ చిత్రం అఖండ 2 అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంతా అనుకుంటున్నారు. ఇక NBK 111వ చిత్రానికి వీరసింహారెడ్డి కాంబో రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ సినిమాతో బిజీగా ఉన్న డైరెక్టర్.. త్వరలోనే బాలయ్య బాబు కథ చెప్పి ఓకే చేయించుకుంటారట. ఇప్పటికే ఇలా మూడు చిత్రాలను లైన్ లో పెట్టిన బాలయ్య బాబు కోసం మరో ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్లు కూడా లైన్ కట్టారు
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణతో ఆయనే సనిమా చేయాల్సి ఉండగా.. చివరి క్షణంలో ప్రాజెక్టు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే తాజాగా దిల్ రాజు బాలయ్య బాబు డేట్ల కోసం వేచి చూస్తున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి ఓ అద్భుతమైన స్టోరీ కూడా రాయిస్తున్నారని టాక్ నడుస్తోంది.

మరోవైపు టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పటికే గీతా ఆర్స్ట్ లో బాలయ్యలో సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. గతంలో ఓ సందర్భంలో అనౌన్స్ కూడా చేశారు. అయితే బోయపాటి డేట్లు కూడా గీతా ఆర్ట్స్ దగ్గర ఉండడంతో వీరిద్దరి కాంబోలో అఖండ సీక్వెల్ చేయడానికి ప్లాన్ జరుగుతుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ అఖండ సీక్వెల్ కోసం మిర్యాల రవీంద్ర రెడ్డి కూడా వేచి చూస్తున్నారట. మరి ఈ ఇద్దరి నిర్మాతల సినిమాల్లో ఎవరి చిత్రాన్ని బాబు ముందు పట్టాలెక్కిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











