For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ సింగర్‌తో విలన్ కబీర్‌సింగ్ పెళ్లి.. ఐదేళ్ల సహజీవనం.. పెళ్లికూతురు ఎవరంటే!

    |

    తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న విలన్ కబీర్ సింగ్ అలియాస్ కబీర్ దుహాన్ సింగ్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. కొద్దికాలంగా ప్రేమిస్తున్న సింగర్‌ మెడలో మూడుమూళ్లు వేయబోతున్నాడు. తన పెళ్లి వార్తను కబీర్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా తన పెళ్లి తేదీని, ప్లాన్స్, సెలబ్రేషన్స్ గురించి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.

     తెలుగులో పవన్ కల్యాణ్ విలన్‌గా

    తెలుగులో పవన్ కల్యాణ్ విలన్‌గా

    తెలుగు సినిమా పరిశ్రమలో రాణిస్తున్న కబీర్ సింగ్ విలన్‌గా జిల్ చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, రవితేజ నటించిన కిక్ 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు విజయవంతమైన టాలీవుడ్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

    తమిళ, కన్నడ చిత్రాల్లో అజిత్, కిచ్చ సుదీప్‌తో

    తమిళ, కన్నడ చిత్రాల్లో అజిత్, కిచ్చ సుదీప్‌తో

    ఇక తమిళం, కన్నడ భాషల్లో కూడా కబీర్ సింగ్ ప్రభావవంతమైన పాత్రలు పోషించారు. కిచ్చ సుదీప్ నటించిన పహిల్వాన్ చిత్రంలో విలన్‌గా మెప్పించారు. అలాగే తమిళంలో వేదాళం చిత్రంలో అజిత్‌తో పోటీ పడే విలన్‌గా నటించారు. ఆ తర్వాత విషాల్ నటించిన యాక్షన్ తదితర చిత్రాల్లో నటించారు.

     గాయని డాలీ సింధూతో రిలేషన్‌షిప్

    గాయని డాలీ సింధూతో రిలేషన్‌షిప్

    ఇలా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ విలన్‌గా పేరుతెచ్చుకొన్న కబీర్ సింగ్ కొద్దిరోజులుగా గాయని డాలీ సింధూతో డేటింగ్ చేస్తున్నారు. 2012లో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడి రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారు. గత ఐదేళ్లుగా వారిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. గతేడాది జూన్‌లో నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకొన్నారు.

    గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌పై కరోనా దెబ్బ

    గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌పై కరోనా దెబ్బ

    కబీర్ సింగ్, డాలీ సింధూ ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. వాస్తవానికి సెప్టెంబర్ గానీ, నవంబర్‌లో గానీ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేశారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా తమ పెళ్లిని కబీర్ సింగ్, డాలీ సింధూ డిసెంబర్‌కు వాయిదా వేశారు.

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    డిసెంబర్‌లో ముంబైలో పెళ్లి.. ఢిల్లీలో రిసెప్షన్

    డిసెంబర్‌లో ముంబైలో పెళ్లి.. ఢిల్లీలో రిసెప్షన్

    ఇక తన పెళ్లి వివరాలను కబీర్ సింగ్ వెల్లడిస్తూ.. డిసెంబర్‌లో పరిస్థితి చూసుకొని పెళ్లి ముంబైలో చేసుకోవాలనుకొంటున్నాం. ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకొంటున్నాం. కరోనావైరస్ ముప్పు ఉన్నందున పెళ్లి ఆర్బాటంగా చేసుకోకూడదని, నిరాడంబరం సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని నిర్ణయించుకొన్నాం అని కబీర్ సింగ్ తెలిపారు.

    English summary
    Sardar Gabbar Singh, Kick 2 villain Kabir Singh going to marriage a singer Dolly Sindhu. He was dating Sindhu for five years. Thye are in relationship since 2015. Now they planned their wedding in December. Marriage will be in Mumbai, Reception will be held at Delhi according lockdown rules.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X