Allu Arjun: మరకలు అంటించే కుట్ర.. బన్నీ వెనుకలా మహాశక్తి ఉంది..

Allu Arjun released: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టు ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అల్లు అర్జున్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘ వాదోపవాదనాల తర్వాత బన్నీకి మద్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. అయితే.. బెయిల్ కాపీ సరిగా లేదని, ఆ తప్పులను సరిదిద్దాలంటూ.. బెయిల్ అప్లోడ్ ఆలస్యం జరిగిందని పలు కారణాలతో అల్లు అర్జున్ ను రాత్రంతా జైల్లోనే ఉంచారు.

ఇలా పలు ట్విస్టులు మలుపులు అనంతరం శనివారం ఉదయం 6:45 నిమిషాలకు అల్లు అర్జున్ ను విడుదల చేశారు. విడుదల అనంతరం అల్లు అర్జున్ తన ఇంటికి కాకుండా గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం బన్నీ అక్కడే ఉన్నారు. దీంతో అల్లు అర్జున్ ను పరామర్శించడానికి పలువురు సెలబ్రిటీలు చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ అరెస్టు పై ఇండస్ట్రీ స్పందించింది. అల్లు అర్జున్ ని ఒక్కన్నే బాధ్యున్ని చేయడం సరి కాదని అది నేరం ఎలా అవుతుందని ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన వారు ఎంతో మంది ఉన్నారు.

Tollywood writer Chinni Krishna Shocking comments On Allu Arjun arrest in the Sandhya Theater stampede case

ఈ క్రమంలో ప్రముఖ రైటర్ చిన్నికృష్ణ మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంటే తనకు ప్రాణమనీ, అల్లు అర్జున్ కి మరకలు అంటించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న ఏ వ్యక్తి అయినా .. ఏ నాయకుడైనా.. ఏ ప్రభుత్వమైనా సర్వనాశనం అయిపోతుంది. అల్లు అర్జున్ .. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ సరికొత్త నిర్వచనం ఇచ్చాడని, అలాంటి అల్లు అర్జున్ పై నింద వేయడం అరెస్టు చేయడం అమానుషం, నీచం, నికృష్టం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ ఒక వ్యక్తి మాత్రమే కాదని, అతని వెనుక.. చిరంజీవి అనే మహాశక్తి ఉందని, ఆయనకు మెగా ఫ్యామిలీ అండ ఉందని పేర్కొన్నారు. అల్లు అర్జున్ కావాలని ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కావాలనే అతన్ని ఇరికించారని, ఇందుకు రాష్ట్రం గాని, ప్రభుత్వం గాని భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రైటర్ చిన్నికృష్ణ.

Tollywood writer Chinni Krishna Shocking comments On Allu Arjun arrest in the Sandhya Theater stampede case

తొక్కిసలాటలో చనిపోయిన మహిళ బాధిత కుటుంబం పై సానుభూతి లేదా మీరు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. సానుభూతి అనేది అందరికీ ఉందని, కానీ అల్లు అర్జున్ ను కావాలని అరెస్టు చేశారని, తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సమయంలో ఇంద్ర సినిమా సమయంలో ఇలానే తొక్కిసలాటలు జరిగాయని గుర్తు చేశారు.

More from Filmibeat

Read more about: allu arjun chinni krishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X