ఆమెను వాడుకుని మోసం చేశాడు... తెలుగు సినీ రచయిత అరెస్ట్!
ఒక మహిళను మోసం చేసి, ఆమెను వాడుకుని వదిలేసిన కేసులో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రచయిత అరెస్ట్ అయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి ఇలాంటి మోసగాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు పథకం ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేశారు.
వైజాగ్ ఎంవీపీ కాలనీకి చెందిన యర్రంశెట్టి రమణ గౌతమ్ అనే 27 ఏళ్ల యువకుడు తెలుగు సినిమాల్లో రచయితగా పని చేస్తూ ఫిల్మ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న భవానీ అనే యువతితో పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ సహజీవనం చేశారు, పెళ్లి పేరెత్తగానే గాయబ్
రమణ గౌతమ్, భవానీ మధ్య మొదలైన స్నేహం క్రమక్రమంగా ప్రేమగా మారింది. గత నాలుగేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే పెళ్లి విషయం ఎత్తేసరికి రమణ తప్పించుకుని తిరగడం మొదలు పెట్టాడు. దీంతో భవానీ ఇటీవల బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

తాళి కట్టి మళ్లీ పారిపోయాడు
వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో భయపడిన రమణ గౌతమ్... వెంటనే భవానీతో పెళ్లికి ఓకే చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజే ఓ గుడిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన కొన్ని గంటల తర్వాత అతడు పారి పోవడంతో అంతా షాకయ్యారు.

విడాకులు ఇవ్వాలంటూ వేధింపులు
రమణ గౌతం తిరిగి వస్తాడని భావించిన భవానీకి షాకింగ్ సంఘటన ఎదురైంది. తనకు విడాకులు ఇవ్వాలని ఆమెకు ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు. విడాకులు ఇస్తే డబ్బు ఇస్తానని ఆశ చూపినట్లు తెలుస్తోంది. దీంతో భవానీ మరోసారి పోలీసులను ఆశ్రయించింది.

పథకం ప్రకారం అరెస్ట్
రమణగౌతం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అతడి కోసం వేట ప్రారంభించారు. అతడు ఎక్కడ ఉన్నాడనే విషయం ట్రాక్ చేయడం ప్రారంభించారు. నారాయణగూడలోని ఓ లాయర్‌ను కలిసేందుకు రమణగౌతం వస్తున్న విషయం తెలుసుకుని పథకం ప్రకారం అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై చీటింగ్, వరకట్నం వేధింపుల కేసులు నమోదు చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications