»   »  గర్ల్ ఫ్రెండ్ ని చితక బాదిన హీరో... పోలీసుల అదుపులో ప్రముఖ నటుడు

గర్ల్ ఫ్రెండ్ ని చితక బాదిన హీరో... పోలీసుల అదుపులో ప్రముఖ నటుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన ప్రేయసిని ఇంట్లో పడేసి చావుదెబ్బలు కొట్టినందుకు ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ సీజ్ మోర్ ను పోలీసులు అరెస్టు చేశారు. గృహహింస కింద అతడిపై అభియోగాలు మోపారు. సేవింగ్ ప్రైవేట్ రియాన్, బ్లాక్ హాక్ డోన్ వంటి ప్రముఖ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించిన టామ్ సీజ్ ను మంగళవారం ఉదయం తర్వాత తమ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టామ్ ఇంటి నుంచి 911 నెంబర్ కు పదే పదే ఫోన్ కాల్స్ వచ్చాయి.,,అందులో బాగా ఏడుస్తున్నట్లు కేకలు వినిపించాయి. ఫైటింగ్ జరుగుతున్న రేంజ్ లో చప్పుళ్లు వినిపించాయి. దీంతో, శరవేగంగా అక్కడికి పోలీసులు వెళ్లగా ఓ యువతిపై చేయి చేసుకుంటూ టామ్ కనిపించాడు.

Tom Sizemore has just been arrested for allegedly beating up his girlfriend

అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులకు ఆమె అతడి గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. తొలుత వాదులాడుకున్నవారు అనంతరం చేయిచేసుకునే వరకు గొడవ వెళ్లిందని గుర్తించారు. తన ముఖంపైనా, తలపైన కొట్టాడని పోలీసులకు ఆమె చెప్పింది. గాయాలు కూడా బాగానే పైకి కనిపించాయి. అయితే, మెడికల్ పరీక్షలకు వెళ్లేందుకు ఆమె నిరాకరించింది.

English summary
Tom was booked for felony domestic violence. As of this post he's still in custody with bail set at $50,000.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu