రేపు తేలనున్న‘ఊసరవెల్లి’ భవితవ్యం
సినిమాలో పాటలు విడుదలైతే చాలు సినిమా భవితవ్యం ఏమిటో సగానికి సగం ఊహించుకోవచ్చు. కొన్ని సినిమాలైతే కేవలం ఆడియోతోనే హిట్ అయిన సందర్భాలున్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆడియోతో సంబంధం లేకుండా సినిమా జయాపజయాలు ఉంటాయి. ఉదా హరణకు ఆరెంజ్ సినిమా తీసుకుంటే..ఆడియో హిట్టు, సినిమా ఫట్టు.
జూనియర్ ఎన్టీఆర్ గతంలో నటించిన శక్తి సినిమా పరమ ప్లాపుగా నిలిచింది. ఆ సినిమా ఆడియో కూడా ఏమంత బాగోలేదనే విమర్శ కూడా అప్పట్లో వినిపించింది. సినిమా స్టోరికీ తోడు ఆడియో కూడా ఆకట్టుకోక పోవడం వల్లనే తీవ్రమైన పరాజయం చవి చూడాల్సి వచ్చింది. దీంతో తన తాజా సినిమా ఊసరవెల్లిపై బోలెడు ఆవలు పెట్టుకున్నాడు జూనియర్. ఈ చిత్రం ఆడియో రేపు(సెప్టెంబర్ 15)న విడుదల కాబోతోంది. దీని ద్వారా సినిమా సగం భవితవ్యం ఏమిటో తేల నుండటంతో ఎన్టీఆర్ తో పాటు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. గురువారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు సహా ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తమన్నా కథానాయిక. సురేందర్‌రెడ్డి దర్శకుడు. భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా పతాకంపై ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











