వారు కూలైతేనే....పవన్-చరణ్ వేడిపుట్టిస్తారు(ఫోటోలు)
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉండగా అనుకోకుండా రాష్ట్రంలో మొదలైన సమైక్యాంధ్ర ఆందోళన కార్యక్రమాల కారణంగా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వారం ముందు విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం కూడా ఇదే కారణంతో విడుదలకు నోచుకోలేదు.
'అత్తారింటికి దారేది' నిర్మాతలు విడుదల తేదీ ఇంకా ఖరారు చేయనప్పటికీ....సమైక్య వాదుల ఆందోళన కాస్త చల్లబడితే సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు నెలాఖరున 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.
మరో వైపు రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ చిత్రం 'జంజీర్', తెలుగు వెర్షన్ 'తుఫాన్' సెప్టెంబర్ 6న విడుదలకు సిద్ధం అవుతోంది. అత్తారింటికి దారేది కూడా విడుదలైతే వారం రోజుల గ్యాప్‌తో ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు కలెక్షన్లు వేడెక్కిస్తాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేది చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ హీరోగా రూపొందతున్న ఈచిత్రంలో సమంత, ప్రణీత హీరోయిన్లు. బివిఎస్ఎన్ ప్రసాద్, రియలన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో సంయుక్తంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

జంజీర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ జంజీర్. ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం గతంలో వచ్చిన అమితాబ్ ‘జంజీర్'చిత్రానికి రీమేక్.

తుఫాన్
రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్లో రూపొందిన ‘జంజీర్' చిత్రాన్ని తెలుగులో ‘తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్నారు. రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీకి చెందినవాడే కావడంతో ఇక్కడ కూడా ఈ సినిమా కలెక్షన్లపై భారీ అంచనాలే ఉన్నాయి.

బాబాయ్‌తో అబ్బాయ్ ఢీ
అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సారి తెలుగు సినిమా బాక్సాఫీసు మెగా హీరోల సినిమాలతో సందడిగా మారనుంది. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన వారం గ్యాప్‌తో రామ్ చరణ్ ‘తుఫాన్' విడుదలయ్యే అవకాశం ఉంది.

మెగా అభిమానులకు పండగ
మెగా ఫ్యామిలీ నుంచి వరస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో మెగా అభిమానులు ఆనందంగా ఉన్నారు. అయితే సమైక్య ఉద్యమం కారణంగా సినిమాల విడుదల ఆగిపోవడంపై వారు కాస్త అసంతృప్తిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











