‘తుఫాన్’ ఆడియో వేడుక ఏర్పాట్లు(ఫోటోలు)
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో వేడుక ఈ రోజు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు.
ఈ సందర్భంగా శిల్పకళా వేదిక వద్ద భారీగా ఏర్పాట్లు చేసారు. మెగా ఫ్యామిలీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లకు సంబంధించిన భారీ ఫ్లెక్సీలతో శిల్పకళా వేదిక ప్రాంగణం కలర్ ఫుల్‌గా తయారైంది.
ఆడియో వేడుకను స్వయంగా వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆడియో వేడుక ఏర్పాట్లు సంబంధించిన ఫోటోలతో పాటు, సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

దర్శక నిర్మాతలు
రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.

ప్రియాంక చోప్రా
ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్‌తో జతకడుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.

ఇరత ముఖ్య పాత్రల్లో..
శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

తొలి బాలీవుడ్ మూవీ
రామ్ చరణ్ నటించని తొలి బాలీవుడ్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్‌కు సౌత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కలిసొస్తుందని భావిస్తున్నారు.

నైజాం రైట్స్
తాజాగా అందుతున్న సమాచారం ఈ చిత్రం నైజాం ఏరియా రైట్స్ ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ. 11 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

నెల్లూరు రైట్స్
ఈ చిత్రం నెల్లూరు రైట్స్ ని క్రౌన్ మూవీస్ సంస్ధ రూ. 1.65 కోట్లు చెల్లించి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

విడుదల తేదీ
సెప్టెంబర్ 6న జంజీర్/తుఫాన్ విడుదలవుతోంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో పెద్ద సినిమాలు విడుదల సమస్య ఎదుర్కొంటున్న నేపథ్యంలో విడుదల తేదీపై కొంత గందగోళం నెలకొంది.

వెనక్కు తగ్గని నిర్మాతలు
ముఖ్యంగా రామ్ చరణ్ చిత్రానికి నైజాం వరకూ హ్యాపీనే కానీ, ఆంధ్రా, సీడెడ్‌ల్లో తమ సినిమాలను విడుదల చేయనిస్తారా లేదా అనే డైలమా ఉంది. అయితే రిలీజ్ తేదీలో మార్పేమీ లేదని సమాచారం. నిర్మాతలు ఎట్టిపరిస్ధితులోలనూ మొదట అనుకున్న తేదీకే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











