చరణ్ డబ్బింగ్ పూర్తి, తుఫాన్ రీలీజ్ డౌటే?
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న భారీ చిత్రం జంజీర్. ఈ చిత్రాన్ని తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల కానుంది. తాజాగా రామ్ చరణ్ తెలుగు వెర్షన్ 'తుఫాన్'కి డబ్బింగ్ పూర్తి చేసారు. పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 వరకు ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి కానున్నాయి.
జంజీర్/తుఫాన్ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసారు. అయితే సీమాంధ్రలో నెలకొన్న సమైక్యవాదుల ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో సినిమాను అనుకున్న సమాయానికి విడుదల చేస్తారా? లేదా? అనేది అనుమానంగా మారింది.
సమైక్యవాదులు చిరంజీవి కుటుంబీకుల సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే 'ఎవడు', 'అత్తారింటికి దారేది' చిత్రాల విడుదల నిలిచి పోయింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణంలో తుఫాన్ సినిమాను విడుదల చేసి రిస్కు ఫేస్ చేయడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు.
రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.


Click it and Unblock the Notifications












