రామ్ చరణ్ ‘తుఫాన్’ ఫస్ట్ లుక్ (వాల్ పేపర్స్.....కేక)
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లో నటిస్తున్న తొలి మూవీ 'జంజీర్' తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వాల్ పేపర్స్ విడుదలయ్యాయి. పోలీస్ గెటప్ లో రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్‌తో కేక పుట్టించే విధంగా ఉన్న ఇవి...సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నాయి.
అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. బిగ్ బి అమితాబ్ పాతికేళ్ల క్రితం నటించిన 'జంజీర్' చిత్రానికి ఇది రీమేక్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ ఇందులో డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. చిత్రం ఆయిల్ మాఫియా నేపథ్యంలో సాగుతుందనే విషయం ప్రస్పుటించేలా ఈ వాల్ పేపర్స్ ఉండటం గమనార్హం. వేసవిలో తుఫాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు నాట ఇప్పటికే హీరోగా సత్తా చాటిన రామ్ చరణ్...బాలీవుడ్లో ఎంట్రీ కూడా అదరగొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

రామ్ చరణ్ ‘తుఫాన్' ఫస్ట్ లుక్ వాల్ పేపర్స్

హిందీలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘జంజీర్' చిత్రాన్ని తెలుగులో ‘తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తోంది.

బిగ్ బి అమితాబ్ పాతికేళ్ల క్రితం నటించిన ‘జంజీర్' చిత్రానికి ఇది రీమేక్.

హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ ఇందులో డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











