‘తుఫాన్’ మూవీ ఆడియో రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' తెలుగులో 'తుఫాన్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈచిత్రాన్ని సెప్టెంబర్ 06, 2013లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈచిత్రం తెలుగు వెర్షన్ 'తుఫాన్' ఆడియో వేడుక ఆగస్టు రెండో వారంలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. 'తుఫాన్' చిత్రం 1973లో అమితాబ్, జయా బచ్చన్ కాంబినేషన్లో వచ్చిన 'జంజీర్' చిత్రానికి రీమేక్. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో ఒకే సారి తెరకెక్కించారు.
ఏసిపి విజయ్ ఖన్నా చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. గ్యాంగ్ లీడర్ తేజ కారణంగా ఏసిపి విజయ్ 6 నెలలు జైలుకెళతాడు. విజయ్ జైలు నుంచి విడుదలైన తర్వాత విలన్ల ఆట ఎలా కట్టించాడు అనేది తర్వాతి కథ. రామ్ చరణ్ యాంగ్రీ యంగ్ మేన్ గా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ప్రియాంక చోప్రా అతని భార్య పాత్ర పోషిస్తోంది. ప్రకాష్ రాజ్, శ్రీహరి, తనికెళ్ల భరణి నెగెటివ్ రోల్స్ లో కనిపించనున్నారు.
రామ్ చరణ్ కెరీర్లోనే దిబెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈచిత్రం నిలవనుంది. అదే విధంగా రామ్ చరణ్-ప్రియాంక మధ్య రొమాంటిక్ సీన్లను సినిమాకు హైలెట్ కానున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి అమిత్ మెహ్రా, ఆయన సోదరులు సుమీత్, పునీత్‌లు నిర్మాతలు.


Click it and Unblock the Notifications












