Just In
- 3 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 5 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇండియన్ తెరను వేడెక్కిస్తున్న విదేశీ భామలు (ఫోటోస్)
ముంబై: గ్లోబలైజేషన్ ఎఫెక్టుతో ఎవరు ఏ దేశానికెళ్లడమైనా, అక్కడ తమ టాలెంటు నిరూపించుకోవడం సులభం అయిపోయింది. సినిమా రంగంలోనూ ఇది కొనసాగుతోంది. ఇండియన్ సినీ స్టార్స్ హాలీవుడ్ వైపు చూస్తుంటే...విదేశీ స్టార్స్ మన సినీ పరిశ్రమపై వెలగటానికి ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్స్ గా వెలుగుగొందుతున్న కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి విదేశీ భామలు తమ అందం, టాలెంటుతో ఇక్కడ అవకాశాలు దక్కించుకుంటున్నారు. చాలా మంది విదేశీ బామలు బాలీవుడ్లో అడుగు పెడుతున్నా అదృష్టం మాత్రం కొందరినే వరిస్తోంది. అలాంటి వారిలో కత్రినా కైఫ్ ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
తొలినాళ్లలో....అందం ఉందే తప్ప నటన, డాన్స్ రాదని విమర్శలు ఎదుర్కొన్న కత్రినా కైఫ్....ఆ తర్వాత తన టాలెంటు నిరూపించుకుని బాలీవుడ్లో నెం.1 స్థానానికి చేరుకుంది. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఇప్పుడిప్పుడు నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. చాలా మంది విదేశీ భామల ఐటం సాంగుల్లో అందాల ఆరబోతకే పరిమితం అవుతూ అలా మెరిసి ఇలా మాయమవుతున్నారు.

కత్రినా కైఫ్
కత్రినా కైప్ భారత సంతతికి చెందిన బ్రిటష్ భామ. ప్రస్తుతం బాలీవుడ్లో ఆమె స్టార్ హీరోయిన్. రణబీర్ కపూర్ తో సహజీవనం చేస్తోంది. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్
2006లో మిస్ శ్రీలంక యూనివర్స్ కిరీటం చేజిక్కించుకున్న జాక్వెలిన్....సినిమా అవకాశాల కోసం బాలీవుడ్ బాట పట్టింది. 2009లో సుజయ్ ఘోష్ చిత్రం ‘అలాదీన్' ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. సల్మాన్ ఖాన్ ‘కిక్' సినిమా తర్వాత అమ్ముడుకి అవకాశాలు పెరిగాయి.

నర్గీస్ ఫక్రి
నర్గీస్ ఫక్రీ పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ నటి. రణబీర్ కపూర్ ‘రాక్‌స్టార్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్లో వివిధ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఆమె స్టైల్

బార్బరా మోరీ
మెక్సికన్ బార్బరా మోరీ హృతిక్‌రోషన్ సరసన 'కైట్స్' చిత్రంలో కన్పించారు. ఇందులో హృతిక్ బార్బరామోరిల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ కావడంతో మళ్లీ అమ్మడు ఇక్కడ కనిపించలేదు.

యానా గుప్తా
జెకోస్లవేకియా దేశస్తురాలు. బాలీవుడ్లో చాలా చిత్రాల్లో నటించారు. 'బాబూజీ జరా ధీరే చలో' అనే ఐటం సాంగ్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

సన్నీ లియోన్
భారత సంతతికి చెందిన కెనడియన్ సెక్స్ చిత్రాల తార. 'బిగ్‌బాస్' ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి ఆరంగేట్రం చేసింది సన్నీ లియోన్. జిస్మ్-2 ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు చిత్రాలతో బిజీగా గడుపుతోంది.

ఎమీ జాక్సన్
బ్రిటిష్ భామ ఎమీ జాక్సన్ ‘మద్రాసి పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇక్కడ కెరీర్ ప్రారంభించింది. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసింది. తాజాగా వచ్చిన ‘ఐ' చిత్రంలో అమ్మడుకి మంచి పేరొచ్చింది.

ఎల్లి అవ్రమ్
స్వీడిష్-గ్రీకు జాతీయురాలైన ఎల్ల అవ్రమ్ ‘మికీ వైరస్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పలు చిత్రాల్లో నటిస్తూ తన అందచందాలతో ఆకట్టుకుంటోంది.

బ్రూనా అబ్దుల్లా
ఇండియన్ తెరను వేడెక్కిస్తున్న విదేశీ భామల్లో బ్కూనా అబ్దుల్లా ఒకరు. బ్రెజిల్ కు చెందిన బ్రూనా బాలీవుడ్లో ఐటం గర్ల్ గా స్థిరపడింది. తమిళ చిత్రం బిల్లా 2లో కూడా నటించింది.