అదీ టామ్ క్రూజ్ రేంజ్..ఇండియాలో నెం.1గా..మరి టాప్ -10లో ఉన్న మిగతా హాలీవుడ్ స్టార్స్ ఎవరంటే?

వివిధ భాషల్లో, ఇతర ఇండస్ట్రీలలోని టాప్ టెన్ హీరోలు, హీరోయిన్లు ఎవరు? ఏ సినిమా ఎక్కువ ఆదరణ పొందింది? ఏ ఇండస్ట్రీలో నుంచి భారీ స్థాయిలో కలెక్షన్లు వసూలు అయ్యాయి? సహా పలు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్. సర్వే చేసి మరీ ఈ వివరాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా ఇండియాలో మోస్ట్ పాపులర్ అయిన టాప్ 10 హాలీవుడ్ హీరోల గురించి తెలిపింది. వివరాల్లోకి వెళితే...

ఇండియన్ సినిమాలకు పోటీగా: యాక్షన్ హారర్ థ్రిల్లర్ జానర్ ఏదైనా.. హాలీవుడ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజే వేరు. భారీ విజువల్స్ తో ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో కళ్లు చెదిరే గ్రాఫిక్స్ తో ప్రేక్షకుల్ని ఓ ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఒకప్పుడు ఇండియాలో కేవలం ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ చిత్రాలు కనిపించేవి. ఎప్పుడైతే సూపర్ హీరో చిత్రాలకు క్రేజ్ బాగా పెరిగాయో.. అప్పటి నుంచి ఈ హాలీవుడ్ చిత్రాలు ఇండియన్ సినిమాలకు పోటీగా ఇక్కడ విడుదలవుతున్నాయి.

top 10 most popular hollywood actors 2023 list

బాక్సాఫీస్ ముందు వేల కోట్లు: మర్వెల్ అవెంజర్స్ , స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, మ్యాడ్ మ్యాక్స్, స్ట్రేంజర్ థింగ్స్, మిషన్ ఇంపాజిబుల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్ ఫ్రాంచైజీలు ఇక్కడ విడుదలై విశేష ఆదరణను దక్కించుకున్నాయి. ఈ హిట్ ఫ్రాంచైజీలు, సిరీస్ లు.. ప్రపంచ బాక్సాఫీస్ ముందు ఎన్నో వేల కోట్లను వసూలు చేశాయి. మన ఇండియన్ బాక్సాఫీస్ లోనూ భారీ స్థాయిలో వసూళ్లు చేశాయి. హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీల నుంచి సినిమా వస్తుందంటే.. చాలు దాని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

top 10 most popular hollywood actors 2023 list

టాప్ 10 హీరోలు ఎవరంటే: అయితే ఈ ఫ్రాంచైజీలకు మాత్రమే కాదు అందులో నటించే ఆయా సూపర్ హీరోస్ కు మనోళ్లలో వీరాభిమానులు ఉంటారు. వారు చేసే విన్యాసాలు చూస్తుంటే ఆడియెన్స్ కు గూస్ బంప్స్ వస్తుంటాయి. వాళ్లు చేసే స్టంట్స్, ఫైటింగ్ సీక్వెన్స్, యాక్షన్ సీన్స్ కు మనవాళ్లు ఫిదా అయిపోతుంటారు. వారికి వీరాభిమానులుగా మారిపోతుంటారు. అయితే తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సర్వే చేసి ఇండియాలో టాప్ 10 మోస్ట్ పాపులర్ మేల్ హీరోస్ ఎవరనేది వివరాలను తెలిపింది.

1. వరల్డ్​ వైడ్​గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్‌ స్టార్ అండ్ యాక్షన్​ హీరో టామ్‌క్రూజ్‌. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్​ తో ఎంతో క్రేజ్ దక్కించుకున్న ఈయన.. తాజాగా 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి భారీ హిట్ అందుకున్నారు. ఈయన ఇక్కడ నెం.1 స్థానంలో చోటు దక్కించుకున్నారు. అత్యధిక అభిమానం చూరగొన్న హాలీవుడ్ స్టార్ గా నిలిచారు.

2.పుత్నె స్వోప్​ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ కమ్ డైరెక్టర్ రోబర్ట్​ డైనీ రెండో స్థానంలో నిలిచారు. .

3.క్రిస్​ హెమ్స్​ వర్త్.. ​ సినీ ప్రియులందరికీ దాదాపు సుపరిచితమే. మార్వెల్​ సినిమాల్లో థోర్ పాత్రతో వర్లడ్​ వైడ్​గా అభిమానులను సంపాదిచుకున్న ఈ హీరో మూడో స్థానంలో నిలిచారు.

4.WWE మాజీ స్టార్​, హాలీవుడ్ స్టార్ హీరో డ్వేన్‌ జాన్సన్‌. కండలు తిరిగిన దేహంతో ఉండే హాలీవుడ్‌ ఈ స్టార్​ఫ్యాన్స్​ ముద్దుగా ది రాక్​ అని పిలుస్తారు. ఈయన అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో నాలుగో ర్యాంకులో నిలిచారు.

5. ఇక ఐదో స్థానంలో మరో నటుడు జానీ డెప్ ఉన్నారు.

6.స్పైడర్ మ్యాన్ ఫేమ్​ హీరో టామ్ హాలాండ్​. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మాయిల రాకుమారుడు. ఈయన ఆరో ర్యాంకును దక్కించుకున్నారు.

7.ఇక వరల్డ్​ వైడ్​గా సినీ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన సిరీస్‌ ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌. అందులో నటించిన విన్‌ డీజిల్‌ అంటే ప్రతి ఒక్కరికీ పిచ్చ క్రేజ్‌. అయితే ఈయనకు పాపులర్ లిస్ట్ లో ఏడో స్థానాన్ని అందుకున్నారు.

8. అమ్మాయిల రాకుమారుడు, హాలీవుడ్ గ్లామర్ హీరో, టైటానిక్ ఫేమ్ కథానాయకుడు​ లియోనార్డో డికాప్రియో ఎనిమిదో స్థానంలో నిలిచారు.

9. మార్వెల్ కామిక్స్​లో హ్యూమన్ టార్చ్​ పాత్రలో గుర్తింపు పొందిన క్లిస్​ ఎవెన్ తొమ్మిదో ర్యాంకును ​ అందుకున్నారు.

10. ఇక ఆస్కార్ విజేత హాలీవుడ్ స్టార్​ బ్రాడ్ పిట్ పదో స్థానంలో నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X