twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ టాప్-10 గ్రాసింగ్ మూవీస్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ ఇండియాలో బాలీవుడ్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సినీ పరిశ్రమగా కొనసాగుతోంది. పరిశ్రమ నుంచి ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇక అగ్రహీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. తెలుగు సినిమాల మార్కెట్ కేవలం ఆంధ్రప్రదేశ్‌‌కే పరమితం కాలేదు. కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.

    తెలుగు సిని పరిశ్రమలో ఇప్పటికే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు ఏమిటి? ఎంత సాధించాయి? కలెక్షన్ల పరంగా స్టామినా ఉన్న హీరోలు, దర్శకులు ఎవరు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

    గబ్బర్ సింగ్

    గబ్బర్ సింగ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గబ్బర్ సింగ్'. మే 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. కలెక్షన్ల పరంగా 81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం రూ. 28 కోట్లతో నిర్మాణమైన.... దాదాపు రూ. 120 కోట్లు వసూలు చేసిందని అంచనా. గబ్బర్ సింగ్ చిత్రంతోనే తెలుగు సినిమా స్టామినా రూ. 100 కోట్లపైనే ఉందని ప్రూవ్ అయింది.

    టాలీవుడ్ టాప్-10 గ్రాసింగ్ మూవీస్

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మగధీర'. హాలీవుడ్ రేంజిలో హై టెక్నాలజీ ఉపయోగించిన తీసిన చిత్రమిది. అతి తక్కువ కాలంలో రూ. 50 కోట్లు రాబట్టింది. రామ్ చరణ్-కాజల్ జోడీగా నటించిన ఈచిత్రం 302 సెంటర్లలో 50 రోజుల వేడుక జరుపుకుంది. ఈ చిత్రం టోటల్ గా వరల్డ్ వైడ్ రూ. 89 కోట్లు వసూలు చేసింది.

    టాలీవుడ్ టాప్-10 గ్రాసింగ్ మూవీస్

    మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘దూకుడు' చిత్రానికి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఓవర్సీస్ బాక్సాఫీసు ఫస్ట్ వీకెండ్‌లో 1 మిలియన్ డాలర్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. రూ. 38 కోట్లతో నిర్మాతమైన ఈచిత్రం 50 రోజుల్లో ర. 54 కోట్లు రాబట్టింది. 256 సెంటర్లలో 50 రోజులు, 31 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.

    టాలీవుడ్ టాప్-10 గ్రాసింగ్ మూవీస్

    స్టార్ హీరోలు లేకుండా కేవలం దర్శకుడు, సాంకేతిక నిమిపుణుల సామర్థ్యంతో బిగ్గెస్ హిట్టయిన చిత్రం ‘ఈగ'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం సాంకేతిక అద్భుతంగా పేరుతెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా టాప్ లిస్టులో చోటు దక్కించుకుంది.

     టాలీవుడ్ టాప్-10 గ్రాసింగ్ మూవీస్

    రామ్ చరణ్-తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రచ్చ'. 28 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏపీలో రూ. 48 కోట్లు వసూలు చేసింది. తమిళం, మలయాళంలో మరో రూ. 7 కోట్లు వసూలు చేసింది. ఓవరస్, రెస్టాఫ్ ఇండియాతో కలిపి టోటల్‌గా రూ. 63 కోట్లు రాట్టింది.

     టాలీవుడ్ టాప్-10 గ్రాసింగ్ మూవీస్

    అల్లు అర్జున్, ఇలియాన హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జులాయి'. అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ హిట్ గా నిలిచిన ఈచిత్రం దాదాపు రూ. 50 కోట్ల వరకు వసూలు చేసింది.

     టాలీవుడ్ టాప్-10 గ్రాసింగ్ మూవీస్

    మహేష్ బాబు, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘పోకిరి' చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. 2006లో విడుదలైన ఈచిత్రం రూ. 40 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది.

    టాలీవుడ్ టాప్-10 గ్రాసింగ్ మూవీస్

    పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన జల్సా చిత్రం పవర్ కెరీర్లో మంచి విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. రూ. 25 కోట్లతో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ. 38 కోట్లు వసూలు చేసింది. 258 సెంటర్లలో ఈచిత్రం 50 రోజులు ఆడింది.

     టాలీవుడ్ టాప్-10 గ్రాసింగ్ మూవీస్

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల జాబితాలో ‘ఇంద్ర' చిత్రానిది ప్రత్యేక స్థానం. అప్పట్లో 500 సెంట్లకు పైగా ఈచిత్రం విడుదలైంది. 151 సెంటర్లలో 50 రోజులు, 122 సెంటర్లలో 100 రోజులు, 32 సెంటర్లలో 175 డేస్ ఆడింది. 2002లో వచ్చిన ఈచిత్రం అప్పట్లో రూ. 33 కోట్లు వసూలు చేసింది.

     టాలీవుడ్ టాప్-10 గ్రాసింగ్ మూవీస్

    తెలుగు సినిమా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్లలో జూ ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం' ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్, సమంత నటించారు. 2010లో విడుదలైన ఈచిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. 142 సెంటర్లలో 50 రోజుల వేడుక జరుపుకుంది.

    English summary
    Telugu film industry is the second biggest film industry in India after Bollywood. It produces hundreds of big-budget movies every year. After Bollywood, this is the only industry, which spends heavily on the film making and promotions. Tollywood movies would release not only in Andhra Pradesh, but also in Karnataka, Kerala, Tamil Nadu and a few other states in North India. Several movies have been listed in all time highest grossing Indian movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X