Sandeep Vanga Reddy: తెలుగోడి సత్తా చూపిన సందీప్ రెడ్డి వంగా.. హయ్యెస్ట్ గ్రాసర్స్‌లో టాప్ 2 మనోడివే..!
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ అని తెరకెక్కించి.. మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో మరో సంచలనం సృష్టించాడు సందీప్ వంగా. ఇక టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ A సెన్సార్డ్ ఇండియన్ సినిమాల్లో రెండు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమాలు నిలిచాయి. అసలు టాప్ 5 సినిమాలు ఏంటి.. సందీప్ వంగా సినిమాలు ఏ పొజిషన్లో ఉన్నాయి.. ఎంత గ్రాసింగ్ రాబట్టాయి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకెత్తు... అర్జున్ రెడ్డి సినిమా మరో ఎత్తు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. ఆలోచన విధానాన్ని మార్చేసింది. ఒక బోల్డ్ కంటెంట్ ను కరెక్ట్ వేలో చూపిస్తూ... ఆడియెన్స్ ను మెప్పించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమని చెప్పాలి. ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ అని షాహిద్ కపూర్ తో తెరకెక్కించాడు. అక్కడు కూడా ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలించింది.

ఇక ఇటీవల రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా యానిమల్ సినిమాను తెరకెక్కించాడు సందీప్. బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇక టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ A సెన్సార్డ్ ఇండియన్ సినిమాల్లో రెండు సినిమాలు సందీప్ రెడ్డి తెరకెక్కించినవే ఉన్నాయి.

ఇండియన్ సినిమాల్లో ఏ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ.. హయ్యెస్ట్ గ్రాసంగ్ సాధించిన టాప్ 5 సినిమాల్లో రెండు సినిమాలు యానిమల్, కబీర్ సింగ్ నిలిచాయి. కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద రూ. 375 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా అటు షాహిద్ కపూర్ కు, ఇటు సందీప్ వంగాకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఇక యానిమల్ సినిమా దాదాపు రూ.600కోట్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా.

ఇక హయ్యెస్ట్ గ్రాసర్ A సెన్సార్డ్ ఇండియన్ సినిమాల్లో టాప్ 3లో కశ్మీర్ ఫైల్స్ నిలిచింది. ఇక ఈ సినిమా రూ.340 కోట్లు వసూలు చేసింది. హయ్యెస్ట్ గ్రాసర్ A సెన్సార్డ్ ఇండియన్ సినిమాల్లో టాప్ 4లో ఆదా శర్మ నటించిన కేరళ స్టోరీస్ నిలిచింది. ఈ సినిమా కూడా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. వివాదస్పద సబ్జెక్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు రాబట్టింది.
ఇక టాప్ 5లో ఓ మై గాడ్ నిలిచింది. ఈ సినిమాకు కూడా ఏ సర్టిఫికెట్ వచ్చింది. దేవుడు సినిమా అయినప్పటికీ.. ఏ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యం. అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.220 కోట్లు రాబట్టింది. ఇవండీ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఏ సర్టిఫికెట్ మూవీస్.


Click it and Unblock the Notifications











