»   » రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన సౌత్ సినిమాలు ఇవే... ! (లిస్ట్)

రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన సౌత్ సినిమాలు ఇవే... ! (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సినిమా రంగంలో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడం అంటే ఇపుడు చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయింది. అయితే సౌత్ సినిమాల విషానికొస్తే ఇది చాలా మంది స్టార్ హీరోలకు అందని ద్రాక్షగానే మిగిలి పోయింది.

ఇప్పటి వరకు సౌత్ లో కేవలం 23 సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. ఇక ఇందులో తెలుగు సినిమాల వాటా విషయానికొస్తే...9 సినిమాలు రూ. 100 కోట్ల క్లబ్ లో స్థానం దక్కించుకున్నాయి.


ఇటీవల విడుదలైన బాక్సాపీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న జనతా గ్యారేజ్ మూవీ తొలి 8 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ 23 సినిమాల లిస్టులో జనతా గ్యారేజ్ 18వ స్థానం దక్కించుకుంది.


అన్నింటికంటే ఎక్కువ వసూళ్లతో బాహుబలి నెం.1 స్థానం దక్కించుకోగా..... టాప్ 5లో మిగిలిన 4 సినిమాలు రజనీకాంత్, శంకర్ సినిమాలే ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు రూ. 100 కోట్ల వసూళ్లను అధిగమించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం....


బాహుబలి

బాహుబలి

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' మూవీ ఫుల్ రన్ లో దాదాపు రూ. 600 కోట్ల పైచిలుకు గ్రాస్ సాధించింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే విజువల్ వండర్ గా పేరు తెచ్చుకున్న ఈచిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది. బాముబలి పార్ట్ 1 రికార్డును బద్దలు కొట్టడం పార్ట్ 2 వల్లనే సాధ్యం అనేది సినీ విశ్లేషకల వాదన.


కబాలి మూవీ

కబాలి మూవీ

ఇటీవల విడుదలైన రజనీకాంత్ కబాలి విడుదల ముందు నుండే భారీ హైప్ సొంతం చేసుకుంది. రజనీకాంత్ కు క్రేజ్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. అయితే సినిమా విడుదలైన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాపీసు వద్ద కాస్త డీలా పడింది. ఓవరాల్ గా ఈ చిత్రం రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి రెండో స్థానంలో ఉంది. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు.


రజనీ-శంకర్ రోబో మూవీ

రజనీ-శంకర్ రోబో మూవీ

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ రోబో అప్పట్లో ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేసిన సంగతి తెలిసిందే. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అలరించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 289 కోట్లు వసూలు చేసింది.


శంకర్, విక్రమ్ ‘ఐ'

శంకర్, విక్రమ్ ‘ఐ'

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మరో భారీ చిత్రం ‘ఐ'. విక్రమ్ హీరోగా నటించిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా శంకర్ టేకింగు చాలా మందిని ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 239 కోట్లు వసూలు చేసింది.


రజనీకాంత్-శంకర్ శివాజీ....

రజనీకాంత్-శంకర్ శివాజీ....

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన మరో భారీ చిత్రం శివాజీ. ఈ చిత్రం అప్పట్లో బాక్సాపీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. అప్పట్లో ఈచిత్రం బాక్సాపీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రం రూ. 155 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.


లింగా ప్లాప్ అయినా...

లింగా ప్లాప్ అయినా...

రజనీకాంత్ మూవీ లింగా ఆ మద్య భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిర్మాతకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. సినిమా బాక్సాపీసు వద్ద రూ. 154 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు అంతకంటే ఎక్కువ కావడంతో నష్టాలే మిగిలాయి.


రామ్ చరణ్, రాజమౌళి మగధీర

రామ్ చరణ్, రాజమౌళి మగధీర

రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన భారీ చిత్రం మగధీర. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు భాక్సాఫీసు వద్ద భారీ హిట్. ఈ చిత్రం అప్పట్లో బాక్సాపీసు వద్ద రూ. 150 కట్ల గ్రాస్ వసూలు చేసింది


మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ తక్కువ రాబడి ఎక్కువగా ఉండటంతో లాభాలు బాగా వచ్చాయి. ఈచిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 144.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.


విజయ్ తేరి....

విజయ్ తేరి....

తమిళంలో విజయ్ నటించిన తేరి మూవీ తెలుగులో కూడా రిలీజైంది. తెలుగులో చిత్రం పెద్దగా ఆడక పోయినా తమిళంలో విజయ్ కు ఉన్న క్రేజ్ తో బాగా ఆడింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 143 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.


పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది మూవీ మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 131 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నిర్మాతకు ఈచిత్రం మంచి లాభాలు తెచ్చిపెట్టింది.


అల్లు అర్జున్ సరైనోడుః

అల్లు అర్జున్ సరైనోడుః

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టెనర్ ‘సరైనోడు' మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మొత్తం రూ. 127.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.


అజిత్ వేదాలం

అజిత్ వేదాలం

అజిత్ హీరోగా తమిళంలో తెరకెక్కిన వేదాలం మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల పంట పండించింది. ఈచిత్ర అక్కడ ఫుల్ రన్ లో రూన. 120 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్.


విజయ్-మురుగదాస్ తుపాకి

విజయ్-మురుగదాస్ తుపాకి

తమిళ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తుపాకి' మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం అప్పట్లో దాదాపు రూ. 125 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.


విజయ్ కత్తి

విజయ్ కత్తి

విజయ్ హీరోగా తెరకెక్కిన మరో తమిళ మాస్ ఎంటర్టెనర్ ‘కత్తి' చిత్రం తమిళంలో రూ. 125 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇపుడు ఇదే చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన నటిస్తున్న 150వ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.


సూర్య సింగం2

సూర్య సింగం2

సూర్య హీరోగా తెరకెక్కుతున్న సింగం సిరీస్ చిత్రాలు బాక్సాపీసు వద్ద సూపర్ సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు ఇప్పటికే రెండు వచ్చాయి. అందులో సింగం 2 మూవీ రూ. 122 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.


రాఘవ లారెన్స్ కాంచన 2

రాఘవ లారెన్స్ కాంచన 2

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన చిత్రం కాంచన 2 కామెడీ హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూల్లు సాధించింది. ఈ చిత్రం రూ.113 కట్ల గ్రాస్ వసూలు చేసింది.


కమల్ హాసన్ విశ్వరూపం మూవీ

కమల్ హాసన్ విశ్వరూపం మూవీ

కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వరూపం మూవీ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 108 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అప్పట్లో ఈ చిత్రం పలు వివాదాలకు కారణమైంది.


పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టెనర్ ‘గబ్బర్ సింగ్' బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 104 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.


ఎన్టీఆర్ కొరటాల శివ

ఎన్టీఆర్ కొరటాల శివ

జూ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్' మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి 8 రోజుల్లోనే రూ. 102 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఈ మూవీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లిస్టులో 15 లేదా 16వ స్థానం దక్కించుకునే అవకాశం ఉంది.


English summary
As many as 20 South Indian Films have joined the Rs 100 crore club so far. 'Janatha Garage' is the new entrant to the elite club and it is placed at 18th position by the end of 8 Days run. The whole list is being dominated by Telugu & Tamil Films. Not even a single Kannada and Malayalam flick made it to the Rs 100 crore club so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu