టాప్-5 బిటౌన్ బికినీ బేబ్స్-2012
ముంబై: సినిమా అంటేనే వినోదం. హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ తో పాటు వారి గ్లామర్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. అందుకే దర్శకులు అన్ని మసాలాలతో పాటు గ్లామర్ రసం కూడా తగిన పాళ్లలో కలిపి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
ఒకప్పుడు హీరోయిన్ల అందాలను పైపైనే చూపించే వారు. కానీ రాను రాను ప్రేక్షకుల అభిరుచి మారింది. పై పై అందాలతో ప్రేక్షకులు సంతృప్తి పడటం లేదు. అందుకే దర్శకులు కూడా వారి అభిరుచికి తగిన విధంగానే హీరోయిన్ల అందాల ఆరబోతను సినిమాలో ఒక ప్రధానమైన భాగం చేసారు. ఈ కాలం సినిమాల్లో హీరోయిన్ల బికినీల ప్రదర్శన సర్వ సాధరణమైంది.
తెలుగు సినిమాల్లో బికినీల జోరు తక్కువేకానీ.... బాలీవుడ్లో ఈ ట్రెండ్ 1958లోనే మొదలైంది. బాలీవుడ్ నటి నూతన్ 'ఢిల్లీ కా తంగ్' తొలిసారిగా భారతీయ సినిమా తెరపై స్విమ్ సూట్లో మెరిసిపోయింది. ఆ తర్వాత 1967లో షర్మిలా ఠాగూర్ 'ఆన్ ఈవినింగ్ ఇన్ పారిస్' చిత్రంలో బికినీ వేసి అందరినీ ఆశ్చర్య పరించింది. ఆ తర్వాత బాలీవుడ్లో బికినీ సీన్లు కామన్ అయిపోయాయి.
2012 సంవత్సరంలో విడుదలైన సినిమాల విషయానికొస్తే.... దీపిక పడుకొనె 'కాక్ టైల్' చిత్రంలో ఈ సంవత్సరం తొలిసారి బికినీ వేసింది. అయితే బికినీ వేసినంత మాత్రాన సరిపోదు, దానికి తగిన బాడీ షేపులు ఉంటనే ప్రేక్షకులు ఇష్ట పడతారు. 'కాక్ టైల్' చిత్రంలో బికినీ వేయడానికి దీపిక చాలా వర్కౌట్లు చేసి కష్ట పడిందట. అంత కష్టపడింది కాబట్టే హాట్ బికినీ బేబ్ అనే ట్యాగ్ సొంతం చేసుకుంది.
2012 టాప్-5 బాలీవుడ్ బికినీ పాపలపై ఓ లుక్కేద్దాం....

దీపిక పడుకొనె- కాక్ టైల్ చిత్రంలో 2 పీస్ బికినీ వేసిన దీపిక పర్ ఫెక్ట్ బికినీ బాడీగా పేరు తెచ్చుకుంది.

సన్నీ లియోన్- జిస్మ్ -2 చిత్రంలో సన్నీ లియోన్ బికినీలతో శృంగార ప్రియులను ఆకట్టుకుంది.

అనుష్క- జబ్ తక్ హై జాన్ చిత్రంలో అనుష్క శర్మ బికినీతో అదరగొట్టింది.

బిపాస బసు- ఈ సంవత్సరం వచ్చిన ప్లేయర్స్ చిత్రంతో పాటు చాలా చిత్రాల్లో బిపాసా బికినీకే అందం తెచ్చిపెట్టింది.

షాజన్ పదంసీ- ఆరెంజ్ హీరోయిన్ షాజన్ పదంసీకి ఇక్కడ అవకాశాలు లేక పోయినా బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేస్తోంది. ఈ సంవత్సరం అమ్మడు హౌస్ ఫుల్-2 చిత్రంలో బికినీ వేసి తన అందాలు జోరుగా ఆరబోసింది.


Click it and Unblock the Notifications











