గూగుల్ మోస్ట్ సెర్చెడ్ హీరోలు వీరే (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : ఏ సినిమా కోసం ప్రేక్షకులు ఎక్కువ గూగుల్ లో సెర్చ్ చేసారు. ఏ హీరోని ఎక్కువగా గూగుల్ లో అన్వేషించారు...అనేది ప్రతీ సంవత్సరం ఆసక్తికరమే. అదే రీతిలో 2013 సంవత్సరంలో ఏ సౌత్ హీరోకి ఎక్కువ మంది సెర్చ్ చేసారన్నది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. మీడియాలో ప్రచారమవుతున్న వివరాలను బట్టి టాప్ 5 ఇవ్వటం జరిగింది.
ముఖ్యంగా తమిళ హీరోలు ఇద్దరు ఈ సెర్చింగ్ లో టాప్ లీడ్ లో ఉన్నారు. వారు అభిమానులు ఎక్కువగా...గూగుల్ వారి ఫోటోలను చెక్ చేయటం,వారి సినిమా విశేషాలు, రోజువారి అప్ డేట్స్ చదవటం చేసారు. అలాగని దీన్ని బట్టే ఫాన్ ఫాలోయింగ్ ని అంచనా వేయలేమని సుస్పష్టం.
ఇక ఐదుగురుకి మరో విశేషముంది..సౌత్ లో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరోలు కూడా వీరే కావటం విశేషం. అలాగే వీరు సినిమాలకి ఓపినింగ్స్ కూడా ఓ రేంజిలో ఉంటాయి. ఇతరదేశాల్లోనూ వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చిన్నా పెద్దా తేడాలేకుండా వీరు అందరికీ తెలుసు. ఇక ఈ గూగుల్ ఎక్కువ శాతం సెర్చింగ్ మెట్రో నగరాల్లో కాకుండా నాన్ మెట్లోల్లో దాదాపు సెవెంటీ పర్శంట్ జరిగినట్లు పేర్కొంది. ఇంటర్నెట్ సేవలు పల్లెటూళ్లకు కూడా విస్తరించటంతో ఇది సాధ్యమైందని గూగుల్ తెలియచేసింది.
గమనిక: ఈ లెక్కలు మీడియాలో ప్రచారంలో ఉన్నవి మాత్రమే...ఫ్యాన్ ఫాలోయింగ్ కు..జయాపజయాలకు,కెరీర్ కి ఈ లెక్కలకు సంభంధం లేదు.
ఇక గూగుల్ ఇండియాలో 2013 లో టాప్ 5 ..స్లైడ్ షోలో...

విజయ్
తమిళ హీరో విజయ్ గురించి గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసారు. విజయ్ ..తుపాకి చిత్రంతో హిట్ కొడితే..ఆ తర్వాత అన్న సినిమాతో డిజాస్టర్ ఫలితం పొందారు. అయినా అతని తాజా చిత్రం జిల్లా కు ఓ రేంజిలో క్రేజ్ ఉంది.

అజిత్
రీసెంట్ గా అజిత్ నటించిన..ఆరంభం చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది. తల చిత్రం అంటే థియోటర్స్ దగ్గర వారం ముందు నుంచే సందడి మొదలవుతుంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని డబ్ చేసి వదిలారు. ఇక సంక్రాంతి కానుకగా అజిత్ నటించిన వీరం వస్తోంది.

పవన్ కళ్యాణ్
తెలుగు హీరో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అత్తారింటికి దారేది వంద కోట్లు మార్క్ కి రీచ్ అవుతోంది. అలాగే గబ్బర్ సింగ్ 2 స్క్రిప్టు బిజీలో ఆయన ఉన్నారు. ఆ చిత్రం సైతం ఓ రేంజిలో విజయం సాధిస్తుందని చెప్తున్నారు.

సూర్య
రక్త చరిత్ర, సింగం వంటి చిత్రాలతో తెలుగు తెరపైనా తానేంటో ప్రూవ్ చేసుకున్న సూర్య ..ఆ మద్యన సింగం- 2 తో భాక్సాఫీస్ ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రం అనుకున్న రేంజిలో విజయం సాధించలేదు. అయితేనేం అతని మార్కెట్ తమిళ,తెలుగు భాషల్లో కొంచెం కూడా తగ్గకపోవటం విశేషం.

మహేష్ బాబు
మహేష్ బాబు...సినిమా గురించే ఇప్పుడు అందరి ఎదురుచూపూ. ఆయన 1..నేనొక్కడినే చిత్రం సంచలన విజయం సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. క్రితం సంక్రాంతికి విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే ఆగడు చిత్రం కూడా ఆయన్ని టాప్ ఛెయిర్ లో కూర్చోబెడుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











