2020లో దుమ్మురేపిన వెబ్ సిరీస్‌లు.. టాప్ 5 లిస్టులో చేరినవి ఇవే..
దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ఓటీటీ పరిశ్రమ ప్రేక్షకులకు అన్ని రకాల వినోదాన్ని పంచింది. థియేటర్లు మూతపడటంతో బుల్లితెరకే ప్రేక్షకులు పరిమితమయ్యారు. అయితే 2020లో సినిమాల రిలీజ్ ఆగిపోవడంతో వెబ్ సీరిస్‌లు ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచాయి. ఈ ఏడాది అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకొన్న టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే..
ఓటీటీలో మంచి స్పందనను కూడగట్టుకొన్న స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరి ఒకటి. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా పాత్రలో ప్రతీక్ గాంధీ నటించారు. దేశంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణానికి కారణమైన కథను దర్శకుడు హన్సల్ మెహతా స్కామ్ 1992గా తెరకెక్కించారు.

ఇక ప్రముఖ దర్శకుడు ప్రకాశ్ ఝా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ఆశ్రమ్. ఈ చిత్రంలో బాబీ డియోల్, ఆదితి పోహంకర్, దర్శన్ కుమార్, త్రిధా చౌదరీ తదితరులు నటించారు. మౌంటీ ఆశ్రమంలో జరిగిన చీకటి కోణాలను ఆశ్రమ్‌గా తెరకెక్కించారు.
లాక్‌డౌన్ ప్రేక్షకులను ఆకర్షించిన మరో వెబ్ సిరీస్ పాతాల్ లోక్. ఈ వెబ్ సిరీస్‌కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిరమాత. ఈ చిత్రంలో జైదీప్ అహ్లావత్, స్వస్తిక ముఖర్జీ, అభిషేక్ బెనర్జీ, గుల్ పనాగ్ తదితరులు నటించారు.
2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ మీర్జాపూర్‌కు సీక్వెల్‌గా వచ్చిన మీర్జాపూర్ 2 కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించింది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగల్, దివ్వేందు శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఈ వెబ్ సిరీస్ మంచి మార్కులు సంపాదించుకొన్నది.
మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ నటించిన తొలి వెబ్ సిరీస్ ఆర్య. హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా తెరకెక్కిన చిత్రంలో ప్రధాన పాత్రను సుస్మితా సేన్ పోషించారు. ఈ వెబ్ అన్ని భాషల్లో భారీ ప్రేక్షకదారణను మూటగట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











