ఓటీటీలే ముద్దు అంటోన్న ముద్దుగుమ్మలు... అమెజాన్ లో అనుష్క, కీర్తి చిత్రాలు

ఇహనో ఇప్పుడో థియేటర్లు తెరచుకుంటాయన్న ఆశలు రోజు రోజుకీ అడుగంటిపోతున్నాయి. రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు అట్ట పెట్టెల్లో మగ్గిపోతున్నాయి. ఇక ఇలా అయితే లాభం లేదని భావిస్తున్న దర్శక-నిర్మాతలు ఓటీటీలకు క్యూ కట్టేస్తున్నారు. ఇందులో భాగంగానే, పలు భారీ స్టార్ క్యాస్ట్ సినిమాలు, భారీ బడ్డెట్ చిత్రాలు సైతం ఓటీటీలే శరణ్యమన్న భావనకు వచ్చేశాయి.

Recommended Video

'Aha' Team Makes Us Happy To Release Johar Movie In OTT Platform
సైలెంట్ గా ఓటీటీ దారిలోకి

సైలెంట్ గా ఓటీటీ దారిలోకి

అందాల అనుష్కా నటించిన నిషబ్దం సినిమా ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీగా అంచనాలను పెంచేసింది. థియేటర్ రిలీజ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన చిత్ర నిర్మాత కోన వెంకట్, ఇక ఆ ఆలోచనను విరమించుకుని, అమెజాన్ ప్రైమ్ లో డీల్ కుదిర్చేసుకున్నాడు. తెలుగు, హిందీ, మళయాళం, తమిళ్, ఇంగ్లీషు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 నిషబ్ధానికి 25కోట్లు మరి...

నిషబ్ధానికి 25కోట్లు మరి...

అనుష్కా, మాధవన్ కలసి నటించిన నిషబ్ధం డిజిటల్ రైట్స్ సుమారు 25 కోట్లకు అమ్ముడు పోయాయని సమాచారం. సెప్టెంబరు రెండో వారంలో నిషబ్దం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలవడనుంది.

పెంగ్విన్ బాటలో సఖి

పెంగ్విన్ బాటలో సఖి

ఆల్రెడీ పెంగ్విన్ తో ఓటీటీ ఎక్స్ పీరియెన్స్ పొందిన కీర్తీ సురేశ్, ఇప్పుడు గుడ్ లక్ సఖీతో మరోసారి నెటిజెన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను కూడా అమెజాన్ ప్రైమే దక్కించుకుందట.

 13కోట్లకు సెట్ అయిన సఖి

13కోట్లకు సెట్ అయిన సఖి

నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తితో పాటూ, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఓ గిరిజన గ్రామానికి చెందిన ఓ అమ్మాయి జాతీయ స్థాయి షూటర్ ఎలా అయిందన్నదే చిత్ర కథాంశం. ఇక ఈ సినిమా డిజిటైల్ రైట్స్ ను 13కోట్ల రూపాయిలకు అమ్ముడు పోయాయని సమాచారం.

హీరోయిన్లను ఫాలో అయిపోతున్న కుర్ర హీరోలు

హీరోయిన్లను ఫాలో అయిపోతున్న కుర్ర హీరోలు

ఇక నిషబ్ధం, గుడ్ లక్ సఖి బాటలోనే మరికొన్ని భారీ చిత్రాలు నడవబోతున్నాయని తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోలో బతుకే సోబెటరు, నేచురల్ స్టార్ నానీ వీ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X