అగ్రహీరోను కించపరిచేలా కామెడీ హీరో ప్రవర్తన!
తమ హీరోను అవమాన పరిచేలా కామెడీ హీరో ప్రవర్తన ఉందంటూ... టాలీవుడ్ అగ్రహీరో బాలయ్య అభిమానులు అగ్గిమీద గుగ్గిలంలా చిటపటలాడుతున్నారని సమాచారం. వీళ్ల ఆగ్రహానికి గురవుతున్న ఆ కామెడీ స్టార్ అల్లరి నరేష్. ఇందుకు గట్టి కారణమే ఉంది. అల్లరి నరేష్ తాజా సినిమా 'మడతకాజ"కు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో కొన్ని డైలాగులు బాలయ్య తన ఫ్యాక్షన్ సినిమాల్లో వాడిన డైలాగులను ఇమిటేట్ చేస్తూ ఉన్నాయట. బాలయ్య డైలాగులను కామెడీ కోణంలో పేల్చడాన్ని అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు ఫ్యాన్స్. ఒక రకంగా అవి తమ హీరోను కించ పరిచే విధంగా ఉన్నాయని ఫీలవుతున్నారట కొందరు.
సినిమాల్లో ఇవన్నీ కామన్. వీటినే పేరడీ అంటారు, కామెడీ పండించడంలో భాగమే ఇది. ఈ మాత్రం దానికి బాలయ్య ఫ్యాన్ ఇలా ఓవర్ గా రియాక్టవ్వడం ఏమిటని మరికొందరు తప్పు బడుతుండటం గమనార్హం. హీరోపై తమ అభిమానాన్ని చాటు కోవడానికి ఏ చిన్న విషయాన్ని కూడా వదల కుండా పబ్లిక్ లో పాపులర్ కావడానికి ఇదంతా చేస్తున్నారని మరికొందరి వాదన.


Click it and Unblock the Notifications











