twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ కీలక సమావేశం.. ఆ హీరోలకు ఆహ్వానం.. వస్తారనుకుంటే చివరి నిముషంలో ట్విస్ట్!

    |

    తెలుగు సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సినీ పరిశ్రమ పెద్దలు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ భేటీ ఆదివారం నాడు ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్​తో చిరంజీవి భేటీ కంటే ముందు ఈ సమావేశం జరగాల్సి ఉండగా వివిధ స్టార్ హీరోలు షూటింగులతో బిజీగా ఉండటంతో రెండు సార్లు వాయిదా పడింది.

    ఇటీవల ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ ఈ నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి హాజరు కావాల్సిన కీలక హీరోలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే

    ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

    ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

    తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారం ప్రధాన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుగుతోంది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఫిల్మ్​నగర్ కల్చరల్ సెంటర్​లో జరిగే ఈ సమావేశానికి 24 శాఖలకు చెందిన సంఘాల ప్రతినిధులు హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు అందాయి.

    సినీ పరిశ్రమలో కరోనా కాలంలో ఎదురైన ఆటంకాలు, ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.

    అంచనాలు ఉన్నా

    అంచనాలు ఉన్నా

    అంతే కాక టాలీవుడ్‌కు చెందిన దాదాపు 250 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపబడినట్లు సమాచారం. ఈ సమావేశానికి నందమూరి బాలకృష్ణ, చిరంజీవి , మోహన్ బాబు, వెంకటేష్ , ఇంకా పలువురు ప్రముఖులు హాజరు కావచ్చని కూడా అంచనాలు ఉన్నాయి. అయితే వారెవరూ మీటింగ్ కు హాజరు కాలేదు.

    అన్ని సంఘాలను

    అన్ని సంఘాలను

    అయితే ఫిల్మ్ ఛాంబర్​లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ , డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ , స్టూడియో సెక్టార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ , ఫిల్మ్ ఫెడరేషన్ , డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలను సమావేశానికి ఆహ్వానించదాంతో వారంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

    హాజరు అవుతారని అనుకున్నా

    హాజరు అవుతారని అనుకున్నా

    ఇప్పటిదాకా అందుతున్న వివరాల మేరకు అయితే సూపర్ స్టార్ కృష్ణ, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మైత్రీ మూవీస్ రవి, నవీన్, బివిఎస్ఎన్ ప్రసాద్ , స్రవంతి రవికిషోర్ , తమ్మారెడ్డి భరద్వాజ, ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్, మాదాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. నిజానికి ఈ అంశాల మీద మౌనం వహిస్తున్న మోహన్ బాబు, బాలకృష్ణ ఈ భేటీకి హాజరు అవుతారని అనుకున్నారు. కానీ హీరోలలో ఒక్కరు కూడా ఈ భేటీకి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

    Recommended Video

    Casting Call From Anand Devarakonda's Gam Gam Ganesha Movie | Filmibeat Telugu
    దూరంగా ఎందుకు

    దూరంగా ఎందుకు

    ఈ భేటీకి ముందు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'సినీ పరిశ్రమ అంతర్గత సమస్యలపై చర్చించనున్నామని, పరిశ్రమలోని అన్ని వ్యవస్థల సభ్యులను ఆహ్వానించామని అన్నారు. గత రెండేళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నింటి పై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. మరి హీరోలు ఎందుకు దూరంగా ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది.

    English summary
    top hero's skipped telugu film chamber of commerce meeting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X