ట్రెండ్ మారుస్తూ న్యూ స్టైల్ ఎంచుకొంటున్నస్టార్ హీరోలు...!?
సీనియర్ హీరోలంతా ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు. అదేనండి మన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కొత్తదనం కావాలని కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. బాలకృష్ణ తన హీరో ఇమేజ్ ని పక్కన పెట్టి ఇప్పటికే కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. శ్రీరాముడుగా 'శ్రీరామ రాజ్యం" సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదలకి కూడా సిద్దమైంది.
ఇక నాగార్జున కూడా రాజన్నగా నటిస్తూ, 'షిరిడి సాయి"గా కూడా అవతారం ఎత్తుతున్నాడు. నాగార్జునకు అన్నమయ్య, శ్రీరామ దాసు వంటి చిత్రాలతో కొంత ఇమేజ్ క్రేజ్ చేసుకొన్న విషయం తెలిసిందే. షిరిడి సాయి ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇక వెంకటేష్ ఇప్పటికే నాగవల్లిలో డిఫరెంట్ గా కనిపించి మెప్పించాడు. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'స్వామి వివేకానంద" గా కనిపించాలనుకుంటున్నాడు. ఇప్పుడు వీరికి తోడుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు'రావణ"చేయనున్నాడని సమాచారం. యమదొంగలో యుడుగా తనస్టైల్ లో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో యంగ్ హీరోలంతా ఫ్యార్ములిక్ చిత్రాలను ఎంపిక చేసుకొంటుంటే..ఇక మన సీనియర్ హీరోలు రూటు మార్చి ప్రేక్షకులని ఏ విధం మెప్పిస్తారో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











