ఆ టాప్ హీరోల 16 ఏళ్ళ ఫైట్ ముగిసింది
ఇవాళా నిన్నటిది కాదు పదహారు ఏళ్ళ నుండి షారూఖ్ ఖాన్, సన్నీడయోల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. డర్ చిత్రం చేస్తున్నప్పుడు వచ్చిన వివాదం వారిద్దరినీ విడతీసింది. అప్పుడు నుంచీ వీరిద్దరూ మాట్లాడుకోలేదు..కలిసి పని చేయలేదు. అయితే ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ తాజాగా వీరిద్దరినీ కలిపాడు.దాంతో షారూఖ్ తన పాత విషయాలు మరిచి సన్నీ డయోల్ కి పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి షారూఖ్ కి సన్నిహితుడైన కరణ్ జోహార్ వస్తే,సన్నీ తో పాటు ఆయన స్నేహితుడు దర్శకుడు నీరజ్ పాఠక్ వచ్చారు. మధ్యవర్తిగా సుభాష్ ఘయ్ వీరిద్దరిని దగ్గరికి పిలిచి మళ్ళీ రీ ఇంట్రడ్యూస్ చేసి కలిపాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఛీర్స్ చెప్పుకున్నారు. అక్కడ నుంచీ వాళ్ళిద్దరూ కబుర్లే..కబుర్లు..ఆ సాయింత్రం అలా ఇద్దరూ పాత విషయాలు గుర్తు చేసుకుంటూ గడిపారు. అంటే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో.


Click it and Unblock the Notifications











