»   » భారీగా ఖర్చుపెట్టిస్తున్న బడా హీరోలు

భారీగా ఖర్చుపెట్టిస్తున్న బడా హీరోలు

By Pratap
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    తెలుగు సినీ పరిశ్రమలో నష్టాలకు ప్రధాన కారణం భారీ బడ్జెట్ సినిమాలే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారీ సెట్టింగులు, ఖరీదైన విదేశీ లొకేషన్లు, అందమైన ముద్దు గుమ్మల కోసం భారీగా ఖర్చు పెడుతున్న దర్శక నిర్మాతలు కథ, కథనంపై సరైన దృష్టి సారించక పోవడమే ఇందుకు కారణమనే విమర్శలు కూడా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తీస్తే పరిశ్రమ పచ్చగా ఉంటుందనేది సినీ పండితుల అభిప్రాయం.

    ఇదిలా ఉండగానే...మరోవైపు టాలీవుడ్ లోని ముగ్గురు అగ్రహీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నారు. బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం రూ. 30 కోట్లతో రూపొందించారు. పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో సెట్టింగులకు భారీగా ఖర్చుపెట్టారు. నాగార్జున 'ఢమరుకం" సినిమా రూ. 40 కోట్లతో రూపొందిస్తున్నారు. ఇక వెంకటేష్ హీరోగా వస్తున్న 'బాడీగార్డు" సినిమా కోసం రూ. 25 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

    పాపులర్ తారాగణం, పేరుమోసిన దర్శకుల కాబినేషన్లో గతంలో వచ్చిన పలు సినిమాలు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో....త్వరలో రాబాయే ఈ ముగ్గురు హీరోల భారీ బడ్జెట్ సినిమాలను భారీగా పెట్టుబడులు పెట్టి కొనడానికి బయ్యర్లు, ఎగ్జిబిటర్లు జంకుతున్నారు. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే.

    English summary
    Tollywood Top Heroes in High Budget movies. Balakrishna Srirama Rajyam Movie Budget Rs 30 crors, Nagarjuna Dhamarukam Movie Budget Rs 40 crors, Venkatesh Bodyguard Movie Budget Rs 25 crors.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more