హాట్ సింగర్ వెంట పడుతున్న టాప్ హీరోలు
మన దేశంలోని పేరుమోసిన ప్లేబ్యాక్ సింగర్లలో శ్రేయ ఘోషల్ ఇకరు. ప్రస్తుతం ఉన్న సింగర్లలో అన్ని భాషల్లో ఎక్కువ పాటలు పాడిన ఘనత ఆమెకే దక్కుతుంది. అద్భుతమైన గొంతుతో పాటు చక్కని ముఖారవిందం ఆమె సొంతం. అందుకే ఆమె అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ విషయం గ్రహించి ఆమెతో సినిమాల్లో నటింప చేయాలని ఇప్పటికే చాలా మంది ట్రై చేశారు. వీరిలో అగ్ర దర్శకులు, బాలీవుడ్ టాప్ హీరోలు సైతం ఉన్నారు. అయితే ప్లేబ్యాక్ సింగర్ గా ఉండటానికే శ్రేయ మొగ్గు చూపింది.
అయితే ఇటీవల శ్రేయ ఘోషల్ జాయ్ అలుకాస్ అనే జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆమె ఆ కంపెనీకి సంబంధించిన ప్రకటనల్లో నటించింది. ఇలా తొలి సారిగా కెమెరా ముందుకు వచ్చింది. దీంతో ఇంతకాలం ఆమెకోసం ఎదురు చూస్తున్న టాప్ హీరోల్లో కొత్త ఆశలు చిగురించాయి. మెల్లి మెల్లిగా సినిమాల్లో నటించేందుకు కూడా ఒప్పుకుంటుందని ఆశ పడుతున్నారు. ఇందు కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు కూడా. మరి ఈ అవకాశం తొలుత ఎవరు దక్కించుకుంటారో చూడాలిమరి.


Click it and Unblock the Notifications











