నాకేం తక్కువ అంటున్న ‘త్రిష’
అగ్ర కాథానాయికలైన కాజల్ అగర్వాల్, నయనతార, ప్రియమణి, ఇలియానా, మొదలైన వారిలో టాప్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లోని చిత్రాల్లో ఓ ఊపు ఊపుతున్న తార త్రిష తాజాగా దృష్టిని బాలీవుడ్ పై సాగించడం తెలిసిందే. అయితే బాలీవుడ్ లో కూడా తన పెర్ఫామెన్స్ తో తన సత్తాను చాటి, తానే నెంబర్ వన్ కావాలని ఉబలాట పడుతోంది. ఒక పక్క హిందీలో చేస్తూనే దక్షిణాదిలో తన సత్తా చాటి తానే నెంబర్ వన్ కావాలని ఉబలాట పడుతోంది. ఒక పక్క హిందీలో చేస్తూనే దక్షిణాదిలో తన పట్టు పోగొట్టుకోకూడదనే ఉద్దేశ్యంతో ఇక్కడ కూడా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి చిత్రాలు ఒప్పుకుంటూనే వుంది. ప్రియమణి, నయనతార, ఇలియానా, ఆసిన్, వంటి తోటి కథానాయికలు అంద చందాలను ఆరబోస్తుంటే తాను మడి కట్టుకు కూర్చోవడం సరికాదని గ్రహించింది. ఇందుకు ఉదాహరణగా శంఖంలో ఆమె చూపించిన అందాలే! అందుకని తన మొదటి ప్రాధాన్యం దక్షిణాది భాషా చిత్రాలకేని సన్నాయి కబురులు చెప్పుతోంది. నిన్న మొన్నటి వరకూ ఎక్స్ పోజింగ్ కి దూరమని బెట్టు చేసిన ఈ భామ, ఇటీవల కాలంలో తన అందాలను ఉదారంగా ఆరబోసేందుకు సై అంటున్నట్లుంది.


Click it and Unblock the Notifications











