సెక్సీ అక్కలతో పోటీ పడలేక పోతున్న చెల్లెళ్లు
వారసత్వాలకు పెట్టింది పేరు అంటే....సినిమా, రాజకీయ రంగాలే. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల అభిమానం, సినిమాల్లో రాణించాలే ప్రేక్షకుల ఆదరణ చూరగొనడం చాలా ముఖ్యం. రాజకీయాల సంగతి పక్కన పెడితే సినిమా రంగంలో వారసత్వాలదే హవా. అయితే ఈ ఫార్ములా హీరోల విషయంలో సక్సెస్ అవుతున్నా, హీరోయిన్ల విషయంలో మాత్రం బెడిసి కొడుతోంది.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దు కోవాలనే చందంగా....తాము ఫామ్ లో ఉన్నప్పడే తమ తోడబుట్టిన వాళ్లను పరిశ్రమకు పరిచయం చేసి హీరోయిన్ చాన్సులు వచ్చేలా సిఫారసు చేస్తున్నారు సెక్సీ హీరోయిన్లు. శిల్పాశెట్టి-షమిత శెట్టి, ఆర్తి అగర్వాల్-అతిథి అగర్వాల్, కాజల్ అగర్వాల్-నిషా అగర్వాల్, అమృతరావు-ప్రీతికారావు ఆ కోవలోకే వస్తారు. త్వరలో తాప్సికూడా తన చెల్లెలు షాగూన్ ను వెండితెరకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది.
అయితే...అక్క పేరు చెప్పుకుని అవకాశాలైతే తెచ్చుకుంటున్నారు గానీ, అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. అక్కయ్యలు హిట్టుమీద హిట్టు కొట్టుకుంటూ దూసుకెలుతుంటే....చెల్లెళ్లు మాత్రం వెకబడి ఆపై తెరమరుగై పోతున్నారు.
పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి అటు బాలీవుడ్ లో ఓ వూపు ఊపడంతో పాటు, టాలీవుడ్ లో జనాలను ఆకట్టుకుంది. ఆమె చెల్లెలు షమితా శెట్టి మాత్రం సినిమాల్లో రాణించ లేక పోయింది. ఆర్తీ అగర్వాల్ టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసన నటించి గుర్తింపు తెచ్చుకోగా ఆమె చెల్లెలు అథితి అగర్వాల్ గంగోత్రి" సినిమాలు చేసి తెరమరుగైంది. ఇటీవల 'లోకమే కొత్తగా" సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా ఫలితం లేక పోయింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్, అమృతరావు చెల్లెలు ప్రీతికారావులు అక్కయ్యల మాదిరి స్టార్స్ కావడం కోబరిలో ఉన్నారు. నిషా అగర్వాల్ ఇప్పటికే ఏమైంది ఈ వేళ చిత్రంతో ఫర్వాలేదనిపించింది. ప్రీతికారావు దక్షిణాదిని తన అదృష్టం పరీక్షించుకుంటోంది. తాజాగా తాప్సీ చెల్లెలు షాగూన్, ఇలియానా చెల్లెలు కూడా రంగంలోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు. మరి వీళ్లు అక్కయ్యల పేర్లను నిలబెడతారో, పడగొడతారో చూద్దాం.


Click it and Unblock the Notifications











