పవన్ కళ్యాణ్‌కి సలహా ఇస్తే మడిచి పెట్టుకో అన్నాడు.. టాప్ ప్రొడ్యూసర్ సంచలనం
ప్రముఖ రచయిత, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ కి తాను సలహా ఇవ్వగా, ఆయన మడిచి నీ దగ్గరే పెట్టుకో అని అన్నారంటూ చెప్పి షాక్ ఇచ్చారు. మరి కోన వెంకట్ ఇచ్చిన సలహా ఏంటి? పవన్ ఎందుకలా రియాక్ట్ అయ్యాడు? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పిస్తున్న హార్రర్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది రిలీజ్ కు రెడీ అవుతోంది. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కోన వెంకట్ పవన్ కళ్యాణ్ తనతో ప్రవర్తించిన తీరు గురించి బయట పెట్టారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ, బిజెపితో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈ కూటమితో కలిసి ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గెలవాలనే కసితో ఉన్నారు పవన్ కళ్యాణ్.
అయితే సినిమా ఇండస్ట్రీలోని ఓ వర్గం నుంచి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ లభిస్తుంటే, మరో వర్గం వారు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో ప్రొడ్యూసర్ కోన వెంకట్ కూడా ఒకరు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ తో జరిగిన ఒక షాకింగ్ సంభాషణను బయటపెట్టారు.
తను పవన్ కళ్యాణ్ కి సలహా ఇచ్చానని, రాజకీయాలు నీకెందుకు? అసలే నువ్వు ఇంట్రోవర్ట్, పైగా మనిషి సెన్సిటివ్ గా ఉంటావు అని పవర్ స్టార్ తో తాను అన్నానని చెప్పుకొచ్చారు. అలాగే ఎవడు పడితే వాడు మాటలు అంటున్నాడు. ఇది నీకు అవసరమా? అని అడిగానని తెలిపారు. దానికి పవన్ కళ్యాణ్ నీ ఒపీనియన్ మడిచి నీ దగ్గరే పెట్టుకో అన్నాడు అంటూ చెప్పి సంచలనం సృష్టించాడు కోన వెంకట్.

స్టార్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ పవన్ కళ్యాణ్ పై ఇలా షాకింగ్ కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2019లో కూడా పవర్ స్టార్ పాలిటిక్స్ పై ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అప్పట్లో జగన్ పై పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను జనసేన జెండా పట్టుకుని తిరుగుతానని సవాల్ చేశారు ఈ నిర్మాత. ఒకవైపు అలాంటి ఛాలెంజ్ విసురుతూనే మరోవైపు పవన్ తనకు సన్నిహితుడని, కత్తి మహేష్ వ్యవహారంలో తను పవన్ కు అండగా మాట్లాడానని గుర్తు చేశారు. అప్పట్లో తీవ్ర దుమారం రేపిన ఆయన వ్యాఖ్యలకు తర్వాత వివరణ ఇచ్చారు కోన వెంకట్.
ప్రస్తుతం ఆయన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీతో బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎంవివి సత్యనారాయణ, జీవి నిర్మించారు. అంజలి కెరీర్లో ఈ మూవీ 50వ సినిమా కాగా, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











