For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మన హీరోయిన్స్ కి ఎంత ఫాలోయింగో (ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ :ఫస్ట్ లుక్ విడుదల చేయాలంటే ప్రత్యేకంగా ఫంక్షన్ పెట్టక్కర్లేదు. ఆడియో లో ఓ పాటను తమ ఫ్యాన్స్ కు చూపెట్టి వారి స్పందన తెలుసుకోవాలంటే ప్రత్యేకమైన వేదిక అవసరం లేదు...లేదా తమ చిత్రం విడుదల తేదీ తెలియచేయాలన్నా ప్రత్యేకంగా ప్రెస్ నోట్ పంపక్కర్లేదు. ఈ రోజు సెలబ్రెటిలకు. కేవలం తమ ట్విట్టర్ లేదా ఫేస్ బుక్ లలో ఓ మెసేజ్ పోస్ట్ చేయటం ద్వారా వారు అందరినీ రీచ్ అవుతనున్నారు.

  గతంలో సెలబ్రెటీల విషయాలు,ఆలోచనలు కేవలం మీడియాకు ఇచ్చిన ఇంటర్వూల ద్వారా మాత్రమే తెలిసేవి. రోజులు మారాయి. ఎప్పటికప్పుడు వారి ఆలోచనలను తమ అభిమానులతో పంచుకునే అవకాసం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ వారికి ఇస్తున్నాయి. మీడియావారు సైతం ఆ ట్వీట్స్, పోస్ట్ లనే వార్తలుగా రాసుకోవాల్సిన పరిస్ధితి ఏర్డడిందంటే అతిశయోక్తికాదు.

  ట్విట్టర్, ఫేస్ బుక్ ఈ రెండు జన జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రెటీల ట్వీట్స్ కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ లో ఖాతాలు తెరుచుకుని చూస్తూండే అభిమానులూ రోజు రోజుకీ పెరుగిపోతున్నారు. ఇంతకీ సౌత్ హీరోయిన్స్ లో ఎవరి ట్విట్టర్ ఎక్కౌంట్ కి ఎక్కవ మంది ఫాలోయిర్స్ ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

  గమనిక: ఈ క్రింద చెప్పబడే ఫిగర్స్ క్షణ క్షణం...జనాభా లెక్కలు లాగ మారిపోతూంటాయి. కాకపోతే కొద్దిగానే డిఫెరెన్స్ ఉంటాయి. ఈ ఆర్టికల్ రాసే సమయానికి ఉండే లెక్కలను బట్టి వివరాలు ఇస్తున్నాం..గమనించుకోండి..

  స్లైడ్ షోలో కథనం...

  జెనీలియా

  జెనీలియా

  తెలుగులో బొమ్మరిల్లు చిత్రంతో సుస్దిర స్దానం సంపాదించుకుని తర్వాత ఎన్నో చిత్రాలు చేసిన జెనీలియా ట్విట్టర్ లో 24,33,160 (2.43 M) ఫాలోవర్స్ తో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది.

  శ్రుతి హాసన్

  శ్రుతి హాసన్

  తెలుగు,తమిళ భాషల్లో నెంబర్ వన్ ప్లేసుకు పోటీ పడుతూ ఉన్న 12,60,565 (1.26M) ఫాలోవర్స్ తో సెకండ్ ఫ్లేస్ లో ఉంది. ఇదే పద్దతిలో ఆమె ముందుకు వెళితే ఏదో ఒక రోజు నెంబర్ వన్ ప్లేసుకు చేరుకోవటం ఖాయం.

  త్రిష

  త్రిష

  తెలుగు,తమిళ భాషల్లో ఒకప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లో నిలబడి ఇప్పుడు సీనియర్ హీరోల చిత్రాలకు పరిమితమైన త్రిష ట్విట్టర్ ఫాలో వర్స్ లో 3 వ స్ధానంలో ఉంది. ఆమెకు ఫాలోరస్ సంఖ్య 921579 .

  హన్సిక

  హన్సిక

  దేశముదురు చిత్రంతో తెలుగులో పరిచయమై తర్వాత తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న ఈ భామకు ఫాలోయింగ్ కూడా బాగుంది. నాలుగవ ప్లేస్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమెకు...6,89,190 (689 K) ఫాలోవర్స్ అన్నారు.

  సమంత

  సమంత

  సికిందర్ చిత్రంలో బికిని తో హాట్ గా అదరకొట్టిన ఆమె ట్విట్టర్ లోనూ మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఆమె ఫాలోవర్స్ సంఖ్య 6,76,295 (676K)

   ప్రియమణి

  ప్రియమణి

  ప్రియమణి ఈ మధ్యకాలంతో ఫేడవుట్ అయి సినిమాలు చెయ్యకపోయినా ట్విట్టర్ లో ఆమె ఫాలోయింగ్ కు లోటు లేదు. ఆమెకు 4,07,487 (470K) ఫాలోవర్స్ ఉన్నారు.

  ప్రియాఆనంద్

  ప్రియాఆనంద్

  లీడర్ చిత్రంతో తెలుగులో పరిచయమైన బెంగాళి భామ కు ట్విట్టర్ లో ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆమెకు 4,98,156 (498K) ఫాలోవర్స్ ఉన్నారు.

  తాప్సి

  తాప్సి

  ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగుకి పరిచయమైన ఈ డిల్లీ బామకు ట్విట్టర్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు 4,78,454 (478K)

  లక్ష్మి మంచు

  లక్ష్మి మంచు

  మోహన్ బాబు కుమార్తెగా పరిచయమైన లక్ష్మి మంచు కు ట్విట్టర్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు.3,55,960 (356K) ఫాలోవర్స్ తో ముందుకు వెళ్తున్నారామె.

  అమలాపాల్

  అమలాపాల్

  రీసెంట్ గా తమిళ దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకున్న అమలా పాల్ కు ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు మొత్తం 2,89,295 (289K)

  రమ్య

  రమ్య

  కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందన కు తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో సినిమాల అభిమానులే కాకుండా రాజకీయపరంగా కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు ట్విట్టర్ లో ...2,65,729 (266K)

  రాధిక

  రాధిక

  తెలుగులో మెగాస్టార్ చిరంజివి తో హీరోయిన్ గా చేసిన ఆమె కమల్ వంటి స్టార్స్ తో తమిళంలోనూ చేసారు. ఇప్పుడు టీవి సీరియల్ నిర్మాతగా, నటిగా ఆమె ఫాలోయింగ్ అపారం. ఆమెకు 2,54,184 (254 k)

  ఖుష్బూ

  ఖుష్బూ

  తమిళ పొలిటీయన్, నటి ఖుష్బూ కు 2,35,663(236K) ట్విట్ట్రర్ లో ఫాలోవర్స్ ఉన్నారు.

  ఛార్మి

  ఛార్మి

  ఈ మధ్యకాలంలో ఫేడ్ అవుట్ అయిన ఛార్మి ట్విట్టర్ లో 1,48,703(149K)ఫాలోవర్స్ ఉన్నారు.

  అమీ జాక్సన్

  అమీ జాక్సన్

  ఎవడు చిత్రంలో హీరోయిన్ గా చేసిన బ్రిటీష్ ఏక్టర్ అమీ జాక్సన్.. కు ట్విట్టర్ లో...1,46,526 (147K)ఫాలోవర్స్ ఉన్నారు.

  రాయి లక్ష్మి అలియాస్ లక్ష్మి రాయి

  రాయి లక్ష్మి అలియాస్ లక్ష్మి రాయి

  తమిళ హిరోయిన్ కు లక్ష్మి రాయి కి అవకాశాలు మాట ఎలా ఉన్నా ట్విట్టర్ లో ఫాలోయింగ్ కి మాత్రం లోటు లేదు. ఆమెకు 1,18,251(118 K) ఫాలోవర్స్ ఉన్నారు.

  వరలక్ష్మి శరత్ కుమార్

  వరలక్ష్మి శరత్ కుమార్

  శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి..హీరోయిన్ గానూ టీనేజ్ కుర్రకారు కు కలలరాణి. ఆమెకు ట్విట్టర్ లో ...89,557 (89.6K) ఫాలోవర్స్ ఉన్నారు.

  తమన్నా

  తమన్నా

  తమన్నా భాటియా తెలుగు,హిందీ, తమిళలలో ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ట్విట్టర్ లో ...79,418 (79.4K)ఫాలోవర్స్ ఉన్నారు.

  కార్తిక

  కార్తిక

  నాగచైతన్యతో జోష్ చిత్రంలో హీరోయిన్ గా చేసిన కార్తిక నాయిర్ కు ట్విట్టర్ లో ...61,096 (61.1K) ఫాలోవర్స్ ఉన్నారు.

  తులసి నాయిర్

  తులసి నాయిర్

  మణిరత్నం కడలి చిత్రంలో హీరోయిన్ గా పరిచయమైన రాధ రెండో కుమార్తెకు యూత్ లో మంచి క్ర్జేజే ఉంది. ఆమె ట్విట్టర్ ఎక్కౌంటు కు... 53,657 (53.7K) ఫాలో ఉన్నారు.

  సంజన

  సంజన

  తెలుగులో ప్రభాస్ చిత్రం బుజ్డిగాడు మేడిన్ చెన్నై లో హీరోయిన్ గా చేసిన సంజనకు ఇక్కడ పెద్దగా ఆఫర్ రాలేదు. కన్నడంలో ఆమెకు మంచి పేరే ఉంది. దాంతో ఆమెకు ట్విట్టర్ లో ...25,998 (26K)ఫాలోవర్స్ ఉన్నారు.

  నిఖిలా పటేల్

  నిఖిలా పటేల్

  పవన్ కళ్యాణ్...పులి చిత్రంతో పరిచమయైన ఆమెకు తెలుగులో ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ రాలేదు. ట్విట్టర్ లో ఆమెకు 13,634 (13.6k)ఫాలోవర్స్ ఉన్నారు.

  English summary
  
 The figures of the followers of each star was taken before the article went live. So, you could see minor differences in the same.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X