అక్కడ సత్తా చాటిన టాలీవుడ్ హీరోలు: మహేశ్, చరణ్ అరుదైన రికార్డ్.. ఈ రెండు సినిమాలు మాత్రమే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ప్రవేశించిన ఈ ఇద్దరూ.. అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. తద్వారా తమ తమ కెరీర్లలో ఎన్నో సూపర్ హిట్లను అందుకున్నారు. ఫలితంగా మార్కెట్‌ను పెంచుకుని సత్తా చాటుతున్నారు. ఇలాంటి ఈ ఇద్దరు హీరోల ఖాతాలో అరుదైన రికార్డులు వచ్చి చేరాయి. మహేశ్ బాబు ఘనతకు హిట్ మూవీ కారణం కాగా, చరణ్‌కు మాత్రం ఓ ఫ్లాప్ సినిమా పేరు తెచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఈ సారి ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేశ్

ఈ సారి ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేశ్

2020 ప్రారంభంలో సక్సెస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు'తో మహేశ్ బాబు భారీ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ సునామీ సృష్టించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆద్యంతం ఎంటర్‌టైనర్‌గా సాగిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోసించారు.

బిగ్ స్క్రీన్‌పై కనిపించని రామ్ చరణ్

బిగ్ స్క్రీన్‌పై కనిపించని రామ్ చరణ్


కెరీర్ ఆరంభం నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే, ఈ ఏడాది మాత్రం అతడు నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. చివరిగా అతడు గత ఏడాది జనవరిలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ'తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది.

చరణ్ 2 సినిమాలు.. మహేశ్ ఒకటి

చరణ్ 2 సినిమాలు.. మహేశ్ ఒకటి


రామ్ చరణ్ నటించిన చిత్రం విడుదలై దాదాపు రెండేళ్లు కావొస్తుంది. ఈ గ్యాప్‌లో అతడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRతో పాటు చిరంజీవి - కొరటాల శివ కలయికలో వస్తున్న ‘ఆచార్య'లోనూ నటిస్తున్నాడు. మరోవైపు, మహేశ్ బాబు.. పరశురాంతో ‘సర్కారు వారి పాట' అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఇది జనవరి మూడో వారం నుంచి షూటింగ్ జరుపుకోనుంది.

మహేశ్ సినిమాకు అరుదైన రికార్డు

మహేశ్ సినిమాకు అరుదైన రికార్డు

గత ఏడాది మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మహర్షి'లో నటించిన విషయం తెలిసిందే. రైతు కష్టాలపై రూపొందిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అదే సమయంలో బుల్లితెరపైనా ఈ మూవీ సత్తా చాటింది. ఇప్పటి వరకు ఈ సినిమా 8 సార్లు టీవీలో ప్రసారం అవగా.. వరుసగా.. 9.3, 7.3, 6.13, 9.02, 10.28, 8.82, 7.14, 5.14 రేటింగులు అందుకుంది.

రామ్ చరణ్ ఖాతాలో మరో ఘనత

రామ్ చరణ్ ఖాతాలో మరో ఘనత

రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టినా బుల్లితెరపై మాత్రం హవాను చూపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం పదహారు సార్లు టీవీలో ప్రసారం అయింది. ఈ క్రమంలోనే వరుసగా 7.90, 8.20, 8.16, 7.20, 8.18, 5.19, 6.35, 7.97, 7.55, 7.51, 7.68, 5.98, 5.12, 4.37, 5.41, 5.21 రేటింగులు అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ ఏడాది ఆ చిత్రాలదే అగ్ర స్థానం

ఈ ఏడాది ఆ చిత్రాలదే అగ్ర స్థానం


ఇక, 2020లో కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోయారు. దీంతో బుల్లితెరపై ప్రసారం అయిన సినిమాలకు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చింది. ఈ ఏడాది మహేశ్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు' మూవీకి 29.40 రేటింగ్‌ దక్కింది. అలాగే, అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో'కు 23.40, ‘ప్రతిరోజూ పండగే'కు 15.13, ‘సైరా'కు 11.80 రేటింగ్ వచ్చింది.

Recommended Video

Rakul Preet Singh Supports Her Brother's Debut ' Tera Venuka'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X