twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్‌కు ముందే ఆదిత్య సంచలనం.. బాలల చిత్రానికి ‘వరల్డ్’ పురస్కారాలు

    By Rajababu
    |

    శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. నవంబర్4, 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ మధ్యాహ్నం ఆటతో పలు కేంద్రాల్లో ప్రదర్శితమవుతోంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం గెల్చుకుంది. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఇండీవుడ్ చిత్రోత్సవంలో అవార్డ్ నూ అందుకుంది. దాదాపు వంద దేశాల్లో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఘనత పొందింది ఆదిత్య క్రియేటివ్ జీనియస్. వంద శాతం పన్ను రాయితీ పొందిన బాలల చిత్రంగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ సందర్బంగా మాజీ గవర్నర్ రోశయ్య, నటులు బ్రహ్మానందం, సుమన్, మరియు చిత్ర యూనిట్ తో పాటు పలువురు ఈ కార్యక్రంలో పాల్గొని భేమనేని సుధాకర్ గౌడ్‌ను అభినందించారు.

    ఆదిత్య చిత్రం ద్వారా బాల బాలికల్లో కులం, మతం అనే బేధాలు ఉండకూడదని, కేవలం ప్రతిభ ఆధారంగానే పిల్లలు ఎదిగేలా చూడాలని, అబ్దుల్ కలాం లాంటి అద్భుత శాస్త్రవేత్తలు మన చుట్టూ ఉండే పిల్లల్లోలనూ ఉండొచ్చని, వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచిస్తూ సందేశమిచ్చారు ఈ చిత్ర దర్శకుడు సుధాకర్ గౌడ్. నేటికీ ఈ చిత్ర ప్రదర్షింపబడుతుండమే కాకుండా పలువురి ప్రశంశలను, అవార్డులను పొందుతున్నందుకు గానూ ఆదిత్య క్రియేటివ్ జీనియస్ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు మరియు తమ సంతోషాన్ని పంచుకోవడానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    Top world records for Aditya Creative Genious movie

    ఈ సందర్బంగా నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ సుధాకర్‌తో నాకు 10 సంవత్సరాలుగా పరిచయం వుంది. సినిమా చేస్తున్న టైములో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నాను మీరు ఒక వేషం వెయ్యాలి అని అడిగారు. నేను కూడా వెంటనే ఓకే చెప్పాను. ఇప్పుడు అదే మా చిత్రం "ఆదిత్య" క్రియేటివ్ జినియస్" కి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పురస్కారం , గౌరవాన్ని తెచ్చి పెట్టింది నాకు. ఇలాంటి సినిమాలను ప్రోత్స హించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.. ఇకపై కూడా సుధాకర్ గారి నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయని, రావాలని అలానే ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు.

    ముఖ్య అతిథి గా పాల్లగొన్న తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య మాట్లాడుతూ..తెలుగు బాలల చిత్రం "ఆదిత్య" క్రియేటివ్ జినియస్" కి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పురస్కారం రావడం ఆనందం గా ఉంది. సినిమా చూసాను. భావి భారత పౌరులైన చిన్నారులు చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకోవద్దని ఇందులో చెప్పారు. అంతేకాదు ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణ, మూగ జీవాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో చూపించారు. ఇలా బాల బాలికల్లో స్ఫూర్తినింపే అనేక అంశాలతో ఆదిత్య క్రియేటివ్ జీనియస్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు భీమగాని సుధాకర్ గౌడ్. కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి నంది గౌరవం దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది.

    దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ...పెద్దవాళ్లతో కంటే పిల్లలతో సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టం. ఆ శ్రమను గుర్తించే జ్యూరీ సభ్యులు ఆదిత్య క్రియేటివ్ జీనియస్ బాలల చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నాకు నంది పురస్కారాన్ని అందించారు. సాధారణంగా బాలల చిత్రాలకు అవార్డ్ లు ఇస్తుంటారు. కానీ బాలల చిత్ర దర్శకుడిగా పురస్కారం దక్కడం మరింత ఆనందంగా ఉంది. జ్యూరీకి, ఫ్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను. విద్యాసంస్థల అధిపతిగా, విద్యావేత్తగా చిన్నారుల పట్ల నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని భావించాను. అందుకే ఆదిత్య క్రియేటివ్ జీనియస్ అనే చిత్రాన్ని రూపొందించాను. పిల్లల సినిమా అనగానే అంతా చిన్నచూపు చూస్తుంటారు. నిర్మాణ విలువలు బాగుండవు అంటారు. కానీ మేము దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో పేరున్న నటీనటులతో ఉన్నత సాంకేతిక విలువలతో ఆదిత్య క్రియేటివ్ జీనియస్ సినిమాను తెరకెక్కించాం అని అన్నారు.

    English summary
    Top world records for Aditya Creative Genious movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X