Top 5 Telugu Movies: సలార్ కాదు.. తెలుగు ఆడియెన్స్ ఎదురు చూస్తున్న టాప్ 5 సినిమాలేంటో తెలుసా?
సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. ముఖ్యంగా మన తెలుగు ఆడియెన్స్ అయితే.. కంటెంట్ బాగుంటే ఈ సినిమానైనా ఆదరిస్తారు. అది పెద్ద స్టార్ సినిమానా.. లేదా చిన్న స్టార్ సినిమానా అని చూడరు. వారికి నచ్చిందంటే.. బ్రహ్మరథం పడుతారు. అయితే ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న టాప్ 5 సినిమాల లిస్టును ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ రిలీజ్ చేసింది. అసలు మనవాళ్లు ఎదురు చూస్తున్న సినిమాలు ఏంటో ఓ సారి లుక్ వేద్దాం పదండి.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ తారాలు, సినిమా విశేషాలపై ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏదో ఒక సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా మరో సర్వే నిర్వహించింది ఈ సంస్థ. తెలుగు మోస్ట్ అవైటెట్ టాప్ 5 సినిమాల లిస్టును తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక అందులో అందరూ అనుకునే విధంగా ప్రభాస్ నటిస్తున్న సలార్ మాత్రం లేక పోవడం ఆశ్చర్యకరం.

అయితే ఆ లిస్టులో మొదటగా అందరూ వెయిట్ చేస్తున్న సినిమా.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్. ఇక ఈ సినిమా పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. అయినా ఇప్పటి నుంచే ఈ సినిమా కోసం మన వాళ్లు వెయిట్ చేస్తున్నారంటే.. ఈ సినిమాపై ఏ రేంజులో అంచనాలు ఉన్నాయో అర్థం అవుతుంది.

ఇక టాప్ 2 మోస్ట్ అవైటెట్ చిత్రం ప్రభాస్ నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ చిత్రం. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భారీ తారాగణమే నటిస్తుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
ఇక టాప్ 3 మోస్ట్ అవైటెట్ చిత్రం ఎన్టీఆర్ దేవర పార్ట్ 1. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

ఇక టాప్ 4 మోస్ట్ అవైటెట్ చిత్రం పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఓజీ. ఈ సినిమాను సాహో దర్శకుడు సుజిత్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టాప్ 5 మోస్ట్ అవైటెడ్ చిత్రం స్పిరిట్. ఇక ఈ చిత్రం ప్రభాస్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానుంది. ఇక ఈ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇవండి టాప్ 5 మోస్ట్ అవైటెడ్ చిత్రాలు.


Click it and Unblock the Notifications











