మాస్ మహరాజా ఈజ్ బ్యాక్: ‘టచ్ చేసి చూడు’ ఫస్ట్ లుక్ అదుర్స్
Recommended Video

టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ నుండి ప్యూర్ మాస్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఈ మధ్య 'రాజా ది గ్రేట్' సినిమా వచ్చినప్పటికీ, మంచి విజయం సాధించినప్పటికీ..... అందులో రవితేజ మాస్ టచ్ మిస్సయిందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులకు కావాల్సిన మాస్ మసాలా ఎంటర్టెన్మెంట్ అందించేందుకు 'టచ్ చేసి చూడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రవితేజ.

ఫస్ట్ లుక్ విడుదల చేసిన రవితేజ
డిసెంబర్ 29న ఉదయం రవితేజ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో రవితేజ లుక్ అదిరిపోయే విధంగా ఉంది. రవితేజ సూపర్ హిట్ సినిమాలను గుర్తు చేసే విధంగా ఈ పోస్టర్ ఉంది.

రిలీజ్ ఎప్పుడు?
బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు. సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. 2018 ఉగాదికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

రాశి ఖన్నా, సీరత్ కపూర్
ఈ చిత్రంలో రవితజ సరసన రాశి ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లు. ఫ్రెడ్డీ దరువాలా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి, సంగీతం : ప్రీతమ్స్ ఎ అండ్ ఆర్ వెంచర్ జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి, మల్లు, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ, కో డైరెక్టర్ : రాంబాబు, ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్, యాక్షన్ : పీటర్ హేన్స్, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

రవితేజ నెక్ట్స్ మూవీ ప్రకటన
రవితేజ ఇటీవలే తన తర్వాతి సినిమా ప్రకటించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని, ఎస్ఆర్‌టి ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో రామ్ తుల్లూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలిపారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











