Don't Miss!
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- News చంద్రబాబు బచ్చా కామెంట్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇలా...!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘టచ్ చేసి చూడు’ ట్రైలర్: పవర్ఫుల్ పాత్రల్లో రవితేజ అదుర్స్!
Recommended Video
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'టచ్ చేసి చూడు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ నాయికలు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా గురువారం సాయంత్రం ట్రైలర్ విడుదల చేశారు.
రవితేజ సూపర్బ్
ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫసర్ పాత్రలో కనిపించబోతున్నారు. రవితేజ గతంలో పలు చిత్రాల్లో పోలీస్ పాత్రలు చేశారు. వాటన్నింటికీంటే భిన్నంగా ఈ పాత్ర ఉండబోతోంది.
డైలాగ్స్ అదుర్స్
యూనిఫాంలో ఉంటే గన్ లో ఆరే బుల్లెట్లు. యూనిఫాం తీసేస్తే రాయితో చంపుతానో, రాడ్ తో చంపుతానో నాకే తెలియదు... అంటూ రవితేజ చెప్పే డైలాగులకు మంచి స్పందన వస్తోంది.
రాశీఖన్నా, సీరత్ కపూర్ గ్లామర్ రోల్స్
ఈ చిత్రంలో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ యాక్షన్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తే వీరిద్దరూ తమ అందంతో ప్రేక్షకులను అలరించనున్నారు.
ప్రొడ్యూసర్స్
నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ `` `టచ్ చేసి చూడు` చిత్రం సెన్సార్ పూర్తయ్యింది. సినిమాకు `యు/ఎ` సర్టిఫికేట్ వచ్చింది. ఈ వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తాం. ఇటీవల సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన పాటలకు , టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నామన్నారు.
ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది
రవితేజ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారని సర్వత్రా అందరూ ప్రశంసిస్తున్నారు. మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. ఫిబ్రవరి 2న సినిమా విడుదలవుతుంది. చూసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది... అని బుజ్జి తెలిపారు.
టెక్నీషియన్స్
ఈ చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ, ఛాయాగ్రహణం : చోటా.కె.నాయుడు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.