ముద్దు : హీరోకు తలనొప్పిగా కిస్ ఆఫ్ లవ్
హైదరాబాద్: కేరళలో మొదలైన ‘కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం సోషల్ మీడియా ద్వారా దేశంలోని వివిధ నగరాలకు పాకిన సంగతి తెలిసిందే. మోరల్ పోలీసింగ్ కు వ్యతిరేకంగా కేరళలోని మెరైన్ డ్రైవ్ వద్ద విద్యార్థులు ఈ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీలో కూడా కొందరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే ఈ కార్యక్రమం మళయాల హీరో టోవినో థామస్‌కు తల నొప్పిగా మారింది. కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమంలో టోవినో థామస్ కూడా పాల్గొన్నారంటూ....ఓ అమ్మాయిని ముద్దాడుతున్న ఫోటో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోలో ఉన్నది ఆయనే అంటూ సోషల్ మీడియా, వాట్పాఫ్‌లో ఫ్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారాన్ని టోవినో థామస్ ఖండించారు.
ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని, తాను ప్రస్తుతం భార్యతో కలిసి హనీమూన్ లో ఉన్నట్లు టోవినో థామస్ చెప్పుకొచ్చారు. ఆ ఫోటోల ఉన్న వ్యక్తి ట్రిమ్ చేసుకుని ఉన్నాడు. కానీ నేను నా తర్వాత సినిమా కోసం గడ్డం పెంచుకున్నాను. ఆ ఫోటోల ఉన్నది తాను కాదని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని థామస్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ పేజీలో కొన్ని ఫోటోలు పోస్టు చేసారు.


Click it and Unblock the Notifications