ప్రభాస్‌కు వార్నింగ్.. దీపిక పదుకోన్‌తో నటిస్తే నీకు కష్టాలే..

యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ జతకట్టబోతుందనే వార్త అందించిన సంతోషం అభిమానుల్లో ఎక్కువ సేపు నిలువలేదు. తాను ప్రభాస్21 చిత్రంలో నటిస్తున్నట్టు జాతీయ మీడియాకు చెందిన వెబ్‌సైట్ రాసిన కథనంపై దీపిక చేసిన ట్వీట్ వివాదంగా మారింది. ప్రభాస్ స్టేటస్‌ను అంగీకరించని విధంగా ఆమె ట్వీట్ చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో దీపిక వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తాజాగా ట్రేడ్ అనలిస్టు ప్రభాస్‌కు బాలీవుడ్‌కు చెందిన ఓ హెచ్చరిక పంపారు. అదేమిటంటే..

వివాదాస్పద ట్వీట్‌తో దీపిక పదుకోన్

వివాదాస్పద ట్వీట్‌తో దీపిక పదుకోన్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రభాస్‌ చిత్రంలో దీపిక నటిస్తున్నారు. ఇంకా ఆ సినిమాకు పేరు పెట్టలేదంటూ ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ సినిమా పేరు #Prabhas21 కాదు. ప్రభాస్ కెరీర్‌లో అది 21వ సినిమా మాత్రమే అంటూ దీపిక ట్వీట్ చేసింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్ ఫైర్ అయ్యారు. సినిమా కాకముందే ఇలాంటి ట్వీట్లు పెడుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీపికకు రూ.30 కోట్ల రెమ్యునరేషన్?

దీపికకు రూ.30 కోట్ల రెమ్యునరేషన్?

ఇలాంటి వివాదం సద్దుమణగకుముందే దీపిక పదుకోన్ రెమ్యునరేషన్‌పై మీడియాలో భారీగా చర్చ జరిగింది. ప్రభాస్‌తో నటించినందుకు గాను.. దీపికా పదుకోన్‌కు బాలీవుడ్ హక్కుల బిజినెస్‌లో షేర్ అడిగారు. దాదాపు ఆమెకు రూ.30 కోట్ల మేర పారితోషికం లభించబోతుందంటూ వార్త బయటకు వచ్చింది. ఈ విషయంపై బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు రోహిత్ జైస్వాల్ స్పందిస్తూ.. ఆమెకు అంత సీన్ లేదు. దీపికను చూసి ఎవరూ థియేటర్‌కు రారు. ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్‌ను వేరే పనికి ఉపయోగించుకోవచ్చు అని ట్వీట్ చేశారు.

 ప్రభాస్‌కు బాలీవుడ్‌లో పిచ్చ క్రేజ్

ప్రభాస్‌కు బాలీవుడ్‌లో పిచ్చ క్రేజ్

అంతేకాకుండా ప్రభాస్‌కు ఓ హెచ్చరిక లాంటిది రోహిత్ జైస్వాల్ ఇస్తూ.. ప్రభాస్ అంటే ప్రేక్షకులకు చెప్పలేనంత లవ్. హిందీలో ఆయనను విపరీతంగా అభిమానిస్తారు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే.. థియేటర్‌కు ప్రేక్షకులను రప్పించడానికి ప్రభాస్ పేరు ఒకటి చాలూ అంటూ రోహిత్ జైస్వాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీపికతో వచ్చే మైలేజ్ సున్నా..

దీపికతో వచ్చే మైలేజ్ సున్నా..


ఇక అంతటితో ఆగకుండా రోహిత్‌ తన ట్వీట్‌లో ‘అనవసరంగా ప్రభాస్‌ను వివాదంలోకి లాగే హీరోయిన్‌తో పనిచేయవద్దు. ఆమెతో భవిష్యత్‌లో చాలా సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా దీపికతో సినిమాకు వచ్చే మైలేజ్ సున్నానే. ఉత్తరాదిలో ఆమెకు అంత స్టార్ డమ్ లేదు. ఆమెను చూసి సినిమాకు వచ్చే ప్రేక్షకులు తక్కువే అంటూ రోహిత్ జైస్వాల్ తన ట్వీట్‌లో పేర్కొనడం చర్చనీయాంశమైంది.

Recommended Video

Prabhas సెల్పీ పై కామెంట్స్, Fitness గాలికొదేలిశాడు | TROLLS
ప్రతిష్టాత్మకంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో

ప్రతిష్టాత్మకంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో

మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ రేంజ్‌లో ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖు సినీ నిర్మాత వైజయంతీ మూవీస్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. జానపద, ఫాంటసీ చిత్రంగా ఈ సినిమాను రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X