»   » బాహుబలి ట్రేడ్ టాక్: ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుందో?

బాహుబలి ట్రేడ్ టాక్: ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుందో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రం తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఏ సినిమా ఏర్పచలేనంత ఆసక్తి ప్రేక్షకుల్లో వచ్చేలా చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాకలో గతంలో ఏ సినిమా కూడా విడుదల కానన్ని థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతుండటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వివిధ భాషల్లో 4000 థియేటర్లలో విడుదలవుతోంది.

సినిమా ఇప్పటికే అంచనాలకు మించి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాదాపు అన్ని థియేటర్లలో అడ్వాన్డ్స్ బుకింగ్ ఇస్తున్నారు. టికెట్స్ అన్ని ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయి పోయాయి. ఈ నేపథ్యంలో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు కనీసం 15 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


TRADE TALK: Baahubali Day 1 Box Office Predictions

ఇతర ఏరియాల్లో 5 కోట్ల వరకు షేర్ వస్తుందని అంచనా. ఇక యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 800k నుండి 1 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందని అంచనా. మరో వైపు ఈ చిత్రానికి కర్ణాటకలో ఈచిత్రానికి సంబందించిన టికెట్స్ రేట్లు పెంచారు. ఈ నేపథ్యంలో అక్కడ వసూళ్లు భారీగానే ఉండొచ్చని అంటున్నారు.


సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే... తొలి వారం 65 కోట్ల వసూలు చేయొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం గత రికార్డులను, అంచనాలను బద్దలు కొడుతూ తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. బాహుబలి తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే స్తాయిలో ఫలితాలు సాధించాలని ఆశిద్దాం.

English summary
Baahubali has garnered unbelievable hype and is gearing up to release with immense craze around it. It is said to be the first of it's kind, made with a budget of 250 crores, releasing in more than 4000 screens. While the film has already made tremendous pre-release business, it is expected to shatter all the records after its release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu