ట్రాఫిక్ రూల్స్‌ను తుంగలో తొక్కిన వినాయక్?
దర్శకుడు వివి వినాయక్ పై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసే అవకాశం ఉందనే వార్త మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఓ బట్టల షాపు ఓపెనింగులో భాగంగా బుధవారం వినాయక్ అమలాపురం వచ్చారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వన్ వేలో రాంగ్ రూట్లో ప్రయాణించింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపినా వినిపించుకోకుండా దూసుకెళ్లింది. అయితే ఆ కారులో వివివినాయక్ ఉన్నప్పటికీ సదరు కారు బట్ట షాపు ఓనర్‌కు చెందినదని, దాన్ని డ్రైవ్ చేస్తుంది కూడా వారి డ్రైవరే అని అంటున్నారు. ఏది ఏమైనా వివివినాయక్ కార్లో ఉండటంతో ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం వినాయక్ రామ్ చరణ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి తెర వెనక కసరత్తు పూర్తి చేస్తున్నారు. మాస్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇందులో డబల్ రోల్ లో కనిపించనున్నాడని, గతంలో చిరంజీవి నటించిన దొంగమొగుడు, రౌడీ అల్లుడు సినిమాల ఆధారంగా ఈ సినిమా స్టోరీలైన్ ఉంటుందని అంటున్నారు.
రచయిత ఆకుల శివతో కథను రసవత్తంగా తయారు చేయిస్తున్న వినాయక్ మరో వైపు సినిమాకు సాంకేతిక వర్గం, నటీనటులను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారు. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ చెర్రీ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











