»   » నేను రీమేక్ చేయాలనుకున్నా: వివి వినాయక్

నేను రీమేక్ చేయాలనుకున్నా: వివి వినాయక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ట్రాఫిక్' సినిమాను నిజానికి తెలుగులో నేను రీమేక్ చేయాలనుకున్నాను. తమిళంలో సూర్య చేసిన స్పెషల్ రోల్...తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్లలో ఎవరితోనైనా చేయించాలనుకున్నా. కథ, కథనాలు అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిజంగా లక్కీ....అంటూ వ్యాఖ్యానించారు దర్శకుడు వివి వినాయక్.

తొలుత మలయాలంలో రూపొంది, తదుపరి తమిళంలో రీమేక్ చేయబడి...తాజాగా తెలుగులో అనువాదం అవుతున్న 'ట్రాఫిక్' ట్రైలర్ విడుదల చేసిన అనంతరం వి.వి.వినాయక్ పైవిధంగా స్పందించారు. గోల్డ్ స్టార్ సినీ స్టూడియోస్ ప్రై.లి పతాకంపై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న 'ట్రాఫిక్' చిత్రం ట్రైలర్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసారు.

Traffic film trailer launch

ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి కళ్యాణ్, బి కాశీవిశ్వనాథం, కె.వి.వి. సత్యనారాయణ, టి. ప్రసన్నకుమార్, మల్టీడైమన్షన్ వాసు, మల్లిడి సత్యనారాయణ రెడ్డి, సి.డి.నాగేంద్ర, ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు, దేవిప్రసాద్, వీరశంకర్, ప్రేమకథా చిత్రమ్ ఫేం ప్రభాకర్ రెడ్డి, సంగీత దర్శకుడు అర్జున్, గోల్డ్ స్టార్ సినీ స్టూడియో సీఈఓ శివప్రసాద్, హీరోయిన్ సందీప్తి, నైజాం డిస్ట్రిబ్యూటర్ సజ్జు, గుంటూరు డిస్ట్రిబ్యూటర్ శివ, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 14వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'సింగం' సూర్య స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో రాధిక, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, విజయ్ కుమార్, చేరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. షాహిద్ ఖాదర్ ఈ చిత్రానికి దర్శకుడు.

English summary

 
 Traffic film trailer launched by VV Vinayak at Prasad labs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu