హీరో సునీల్ కారుకు రూ.వంద జరిమానా
ఇందుకోసం గురువారం పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. నగరంలోని పలు కూడళ్లలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హీరో సునీల్‌కు చెందిన కారులో ఆయన తల్లి వెళుతుండగా ట్రాఫిక్ పోలీసులు దానిని పట్టుకొని రూ.వంద జరిమానా విధించారు. బ్లాక్ ఫిల్మ్ ఉన్నందుకే జరిమానా విధిస్తున్నట్లు చెప్పి, దానిని తొలగించాలని సూచించారు.
కాగా పంజాగుట్ట చౌరస్తా, ఖైరతాబాద్ చౌరస్తా, చెక్ పోస్టు తదితర ప్రాంతాలలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బ్లాక్ ఫిల్మ్ ఉన్న పలు కార్లకు రూ.వంద జరిమానా విధిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ... కార్లపై బ్లాక్ ఫిలిం ఉండకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు అన్నారు.
అలా ఉంటే దానిని తొలగించడంతో పాటు రూ.100 జరిమానా విధిస్తామని చెప్పారు. ప్రజలు సహకరిస్తున్నారన్నారు. ప్రస్తుతం వంద రూపాయల జరిమానా మాత్రమే విధిస్తున్నామని, రెండు రోజుల తర్వాత జరిమానాను రూ.నాలుగు వందలు లేదా అంతకు ఎక్కువకు పెంచుతామని చెప్పారు. ప్రజల్లో అవగాహన తీసుకు వస్తామన్నారు.


Click it and Unblock the Notifications












