రోడ్డుపై యంగ్ హీరో ట్రాఫిక్ పాఠాలు
రోజు రోజుకీ పెరగిపోతున్న ట్రాఫిక్ ని నియంత్రించటానికి డిల్లీ పోలీస్ శాఖ మరో కొత్త ప్రయోగం చేసింది. బాలీవుడ్ చిత్రం ధోభీఘాట్‌లో ధోభీ కుర్రాడిగా చేసి పేరుతెచ్చుకున్న ప్రతీక్ బబ్బర్ ని రంగంలోకి దించి ట్రాఫిక్ పాఠాలు చెప్పించారు. ఆ హీరో ఆదివారం ఢిల్లీవాసులకు ట్రాఫిక్ నియమాలపై స్వయంగా అవగాహన కలిగించాడు. రోడ్డుభద్రత, ప్రమాదాల నివారణ కోసం ప్రారంభించిన 'స్ట్రాప్ ది హెల్మెట్" ప్రచారోద్యమం కోసం పోలీసు అధికారులు ప్రతీక్ ను రంగంలోకి దింపారు. కేవలం ప్రకటనల్లో నటించి సరిపెట్టుకోకుండా.. ఆదివారం ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ప్రతీక్ రాజ్‌పథ్, జన్‌పథ్ రోడ్లపైకి వెళ్లాడు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిని ఆపి దాని ఆవశ్యకతను గురించి వివరించాడు.
'ఇవి (హెల్మెట్లు, వాటిని సరిగ్గా ధరించడం) ట్రాఫిక్ భద్రతకు సంబంధించిన ప్రాథమిక నియమాలు. ప్రమాదాలు సంభవిస్తే మన ప్రాణాలను రక్షిం చేవి ఈ చిన్న జాగ్రత్తలే!" అని కాంగ్రెస్ ఎంపీ, నటుడు రాజ్‌బబ్బర్ కుమారుడు కూడా అయిన ప్రతీక్ చెప్పాడు. ఢిల్లీతోపాటు ముంబైలోని చాలా మంది హెల్మెట్లు ధరించడం లేదని, కొందరేమో హెల్మెట్ తాడును బిగించుకోవడం లేదని పేర్కొన్నాడు. ఈ చిన్న జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంటుం దని ఈ 24 ఏళ్ల నటుడు హెచ్చరించాడు. గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న 'ప్రేమకథ" తన తాజా చిత్రమని ప్రతీక్ చెప్పాడు. ఇందులో చాలా సీన్లు బైకులతో చేశానని, అప్పుడు కూడా ట్రాఫిక్ నియమాలను పాటించానని వివరించాడు.


Click it and Unblock the Notifications











